మైసూర్ లో తెలుగు విద్యార్థి మృతి | telugu stundent died in mysore | Sakshi
Sakshi News home page

మైసూర్ లో తెలుగు విద్యార్థి మృతి

Published Fri, May 1 2015 10:02 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

telugu stundent died in mysore

రాజమండ్రి : కర్ణాటక రాష్ట్రానికి ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. టూర్ లో భాగంగా వాటర్‌ఫాల్‌లో ఈతకు దిగి మునిగి పోయాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అజయ్‌కుమార్(18) చెన్నైలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్ ఇండస్ట్రియల్ టూర్ కోసం విద్యార్థులు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు. గురువారం ఓ వాటర్ ఫాల్ లో ఈతకు దిగిన అజయ్ ప్రమాదవశాత్తూ మునిగి పోయాడు. అతని మృతదేహం కోసం గాలించగా శుక్రవారం బయటపడింది. అజయ్ మరణవార్తతో అతని స్వగ్రామం రాజమండ్రి మండలం బొమ్మూరు విషాదచాయలు అలుముకున్నాయి. అజయ్ తండ్రి  గురువారం రాత్రి మైసూరుకు బయలుదేరి వెళ్లారు. సంఘటన గురించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement