
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, మైసూరు: పరాయి పురుషుడితో కన్నతల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మైసూరు జిల్లా నంనగూడు తాలూకా హుణసనాలు గ్రామంలో చోటుచేసుకుంది. మహాదేవశెట్టి దంపతుల కుమారుడు మహేంద్ర (27). ఇదిలా ఉంటే మహాదేవశెట్టి భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
ఈ విషయంగా దంపతుల మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి. భార్య మాట వినకపోవడంతో ఈ విషయాన్ని తండ్రి, కుమారుడి దృష్టికి తెచ్చాడు. అతను కూడా తల్లితో మాట్లాడాడు. అయితే ఆమెలో మార్పు కనిపించలేదు. సమాజంలో తలెత్తుకుని తిరగలేమని భావించిన మహేంద్ర సోమవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకున్నాడు. నంజనగూడు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (బెంగళూరులో విషాదం.. విగతజీవులుగా తల్లీ, కొడుకు, కూతురు)
Comments
Please login to add a commentAdd a comment