నాగార్జున వర్సిటీలో నూతన వీసీ ఉదయలక్ష్మి | New Vice chancellor Udayalakshmi visits Nagarjuna University | Sakshi
Sakshi News home page

నాగార్జున వర్సిటీలో నూతన వీసీ ఉదయలక్ష్మి

Published Thu, Aug 13 2015 4:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

నాగార్జున వర్సిటీలో నూతన వీసీ ఉదయలక్ష్మి

నాగార్జున వర్సిటీలో నూతన వీసీ ఉదయలక్ష్మి

నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ కొత్త ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఉదయలక్ష్మి గురువారం మధ్యాహ్నం వర్సిటీలో పర్యటించారు. ముందుగా ఆమె డీన్లు, వివిధ విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. వర్సిటీ గురించి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్యపై ఆమె ఆరా తీయగా..  అధికారులెవరూ స్పష్టంగా చెప్పలేకపోవటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందుగా ఆ వివరాలన్నీ కంప్యూటరీకరించాలని ఆదేశించారు. అనంతరం ఆమె విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల హాస్టళ్లలో పురుష సిబ్బంది పనిచేస్తుండటాన్ని గమనించారు. వారిని వెంటనే బదిలీ చేయాలని చెప్పారు. కొందరు విద్యార్థినులు హాస్టళ్లలో ఉన్న సమస్యలు ఏకరువు పెట్టడంతో అందుకు కారకులైన సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement