
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రమాదా లు ఉన్నాయని ప్రకృతి శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ వద్ద ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసా యం’పై రైతులకు ఇస్తున్న రాష్ట్ర శిక్షణ సదస్సులో సోమవారం రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ విదేశీ వానపాములు, వర్మికంపోస్టు దుష్ఫలితాల గురించి, స్వదేశీ వానపాముల వలన లాభాలను వివరించారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి నాలుగు అంశాలు వివరించారు.
ముఖ్యంగా పంటకయ్యే ఖర్చు అంతర్ పంటల ఆదాయంతో భర్తీ చేయవచ్చని తెలిపారు. మొక్కల పెంపుదలకు కావాల్సిన ఏ ముడిపదార్ధాలు కొనుగోలు చేయకుండానే తయారు చేసుకోవచ్చని వివరించారు. యోగ వ్యవసాయ గురించి, దీనివల్ల కలిగే మోసాలు, అగ్నిహోత్ర గురించి ప్రత్యేకంగా తెలిపారు. రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, జాయింట్ కలెక్టర్ –2 ముంగా వెంకటేశ్వరరావు, జేడీ విజయభారతితోపాటు రైతులు పాల్గొన్నారు.