
‘నాగార్జున’లో కొనసాగుతున్న పీజీ కౌన్సెలింగ్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి కౌన్సెలింగ్ కొనసాగుతోంది.
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశానికి కౌన్సెలింగ్ కొనసాగుతోంది. యూనివర్సిటీ కౌన్సెలింగ్ కేంద్రంలో బుధవారం ఎమ్మెస్సీ కెమికల్ సైన్స్‌లో 1201 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. అలాగే, ఫిజికల్ సైన్స్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, పీహెచ్ కేటగిరీల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 200వ ర్యాంకు వరకు కౌన్సెలింగ్ కొనసాగుతోంది. దీంతోపాటు కామర్స్‌లో ఎన్‌సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీహెచ్ కేటగిరీల్లో అన్ని ర్యాంకులకు, జనరల్ కేటగిరీలో 1 నుంచి 500 ర్యాంకు వరకు ఈరోజు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.