గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయాన్ని నేటినుంచి వచ్చే నెల 4 వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ కేఆర్ఎస్ సాంబశివరావు ...పదిరోజులు సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం లోగా హాస్టల్స్ ఖాళీ చేయాలంటూ... సెలవులకు సంబంధించి నోటీసులను యూనివర్సిటీ అంతటా అంటించారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు రిషికేశ్వరి కేసును నీరుగార్చేందుకే వర్సిటీకి సెలవులు ప్రకటించారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.