సాక్షి, గుంటూరు: ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్(ఐఈఏ) శతాబ్ధి ఉత్సవాలను బుధవారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. ' భారత ఆర్థికాభివృద్ధి అనుభవాలు' పేరిట నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగునుంది. ఈ కార్యక్రమంలో గవర్నర నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు దేశ , విదేశాలకు చెందిన ఆర్థిక వేత్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకు వచ్చిన ఆర్థిక వేత్తలు 7 ప్యానళ్లుగా ఏర్పడి వివిధ అంశాలపై చర్చిస్తారు. కీలకమైన 16 అంశాలపై ప్రముఖ ఆర్థిక వేత్తలు కీలకోపన్యాసం చేయనున్నారు.
కాగా, అంతకు ముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి దంపతులు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో నాగార్జున వర్సిటీకి చేరుకున్నారు. ఐఈఏ సదస్సు అనంతరం సచివాలయంలో ఫైబర్‌గిడ్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment