
ఏపీ తాత్కాలిక సచివాలయంగా నాగార్జున వర్సిటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంగా గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీని ఎంపిక చేశారు. కొత్త రాజధాని కోసం భూ సేకరణ జరిపే గ్రామాలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉన్నతాధికారుల కమిటీ యూనివర్సిటీలోని భవనాలను పరిశీలించింది. యూనివర్సిటీలోని కొన్ని శాఖలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని గుంటూరు జిల్లాలోనే నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారులు, నాయకులు ఇప్పటికే భూ సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.