నాగార్జున మహిళా హాస్టల్ వద్ద ఆగంతకుడి కలకలం | un identified man try to enter into nagarjuna university womens hostel | Sakshi
Sakshi News home page

నాగార్జున మహిళా హాస్టల్ వద్ద ఆగంతకుడి కలకలం

Published Thu, Oct 8 2015 10:07 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

un identified man try to enter into nagarjuna university womens hostel

నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ మహిళా హాస్టల్ సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కలకలం రేపాడు. మహిళా హాస్టల్ సమీపంలోని కరెంటు స్తంభంపైన రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉండటం హాస్టల్ లోపల ఉన్న విద్యార్థినులు గమనించారు.

వారు వెంటనే ఆవిషయాన్ని భద్రతా సిబ్బందికి తెలియజేశారు. సెక్యూరిటీ అప్రమత్తమయ్యేలోగానే ఆ ఆగంతకుడు అక్కడి నుంచి వెంటనే దిగి పరారయ్యాడు. ఈ విషయమై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. కాగా, హాస్టల్ ప్రహరీకి సోలార్ ఫెన్సింగ్ ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement