Womens Hostel
-
కిటికీలు తొలగించి.. చొరబాటు
సనత్‌నగర్: యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ (ఉస్మానియా యూనివర్సిటీ) ఉమెన్స్ హాస్టల్లోకి శుక్రవారం రాత్రి ముగ్గురు ఆగంతకులు చొరబడి హంగామా సృష్టించారు. హాస్టల్ కిటికీలు తొలగించి లోపలికి ప్రవేశించడంతో విద్యారి్థనులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వెంటనే అప్రమత్తమై ముగ్గురిలో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్యారడైజ్ సమీపంలోని వాటర్‌వర్క్స్ కార్యాలయంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేసే శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు మద్యం తాగి శుక్రవారం అర్ధరాత్రి పీజీ కాలేజ్ హాస్టల్ వద్దకు వచ్చారు. కిటికీలను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. విద్యారి్థనులు పట్టుకునేందుకు ప్రయత్నించగా శ్రీకాంత్ ఒక్కడే చిక్కడంతో 100కు సమాచారం అందించారు. బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మిగతా ఇద్దరు నిందితుల పేర్లను శ్రీకాంత్ వెల్లడించడం లేదు. ఆందోళన.. ఉద్రిక్తత.. తమకు రక్షణ కరువైందంటూ హాస్టల్ విద్యారి్థనులు శనివారం ఆందోళనకు దిగారు. వీసీ వచ్చి హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా అంటూ ధర్నా కొనసాగించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హాస్టల్లోసీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, స్టాటి క్ సెక్యూరిటీ ఫోర్స్ నియమించాలని, రెండు కిటికీలను మరమ్మతులు చేయించాలని, ప్రహరీగోడ ఎత్తు పెంచాలనే డిమాండ్లను వ్యక్తంచేశారు. నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ రామలింగరాజు, సీఐ భాస్కర్లు పరిస్థితిని సమీక్షించి యూని వర్సిటీ అధికారులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ రవికుమార్‌తో కలిసి డీసీపీ రోహిణి ప్రియదర్శిని విద్యారి్థనులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ ఉమెన్స్ హాస్టల్ లో ఉద్రిక్తత
-
‘నిజాం’ మహిళా హాస్టల్ ఏర్పాటు సమంజసమేనా?
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజీలో మ హిళా హాస్టల్ ఏర్పా టుచేయాలన్న విద్యా ర్థిసంఘాల డిమాండ్ నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారుల ను విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించా రు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్, కాలేజీ విద్య కమిషన్ నవీన్‌మిట్టల్ సహా పలువురు అధికారులతో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. నిజాం కాలేజీలో హాస్టల్ ఏర్పాటుపై వచ్చిన డిమాండ్ ఎంత వరకు సమంజసమో పరిశీలించి నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ డిమాండ్ లేవ నెత్తిన విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సంప్ర దించాలన్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ చదువు తున్న బాలురకు ఏళ్లుగా హాస్టల్ సౌకర్యం ఉందని, కానీ బాలికలకు అక్కడ హాస్టల్ సదు పాయం లేదని అధికారులు మంత్రికి వివరించారు. హాస్టల్ ఏర్పాటు చేసే స్థలం కూడా లేదని అధికారులు తెలిపినట్లు సమాచారం. చదవండి: కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
నారాయణఖేడ్ కస్తూర్బా బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్
-
ఉమెన్స్ హాస్టల్లో తప్పిన పెను ప్రమాదం!
మాదాపూర్: సెల్లార్ తవ్వడంతో హాస్టల్ గోడ కూలి ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్‌లోని పత్రికానగర్‌లో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఒక్కసారిగా సెల్లార్ పక్కనే ఉన్న గది గోడ కూలడంతో హాస్టల్లో ఉన్న వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు. పత్రికానగర్‌లో సాయిసంగమేశ్వర హాస్టల్‌ను నెల్లూరు జిల్లా పంగం గ్రామానికి చెందిన శ్రీహరి అనే వ్యక్తి తల్లితో కలిసి మూడేళ్లుగా పీజీ ఉమెన్స్ హాస్టల్‌ను నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా హాస్టల్ పక్కనే భవన నిర్మాణం చేసేందుకు సెల్లార్‌ను తీస్తున్నారు. మంగళవారం రాత్రి 9.30 గంటలకు హాస్టల్‌కి అదనంగా ఉన్న గది గోడ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో గదిలో నిద్రిస్తున్న నిర్వాహకులు వెంకటమ్మకు తీవ్రగాయాలయ్యాయి. రెండు చేతులు, వెన్నెముక దెబ్బతిన్నాయి. మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. హాస్టల్ ఖాళీ.. హాస్టల్ కింది భాగమంతా బీటలు వారడంతో ప్రమాదకరంగా మారింది. ఇందులో ఉన్నవారిని ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. దీంతో దాదాపు 70 మంది విద్యార్థినులు, వర్కింగ్ ఉమెన్స్ లగేజ్‌లు తీసుకొని వెళ్లిపోయారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులు స్థల యాజమానులపై కేసులు నమోదు చేశారు. యాజమానులు కాసు శైలజారెడ్డి, కాసు దినేష్‌రెడ్డి, సెక్షన్ ఇంజనీర్ రాజరాం తివారీ, టెక్నికల్ శ్రీశైలంలపై కేసులను నమోదు చేశారు. ఇలాంటి సెల్లార్లను తీసే సమయంలో ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇస్తూ చుట్టుపక్కల వారికి కూడా సమాచారం ఇవ్వాలి. అలాంటివి ఏమి చేయకుండా సెల్లార్లను తవ్వినట్లు అధికారులు తెలిపారు. -
లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాలు
చెన్నై: దక్షిణ భారతంలో అతిపెద్ద నగరం చెన్నైలోని తిళ్లై గంగానగర్‌లో అది ఒక లేడీస్ హాస్టల్. దాని యజమాని సంపత్‌రాజ్ అలియాస్ సంజయ్. రెండు నెలల క్రితమే ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని హాస్టల్ నడుపుతున్నాడు. నెలకి రూ. 5,500 అద్దె చెల్లిస్తే ఆ హాస్టల్లో ఉండొచ్చు. ధర అందుబాటులో ఉండటంతో విద్యార్థినులు, ఉద్యోగినులు ఆ హాస్టల్లో చేరారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ హాస్టల్ ఎంత ప్రమాదకరమో, అమ్మాయిల బతుకుల్ని ఎలా బజారుపాలు చేస్తోందో వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 2న ఒక అమ్మాయి తలంటు స్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోవడానికి బాత్రూమ్లోనే ఉన్న ప్లగ్ పాయింట్లో హెయిర్ డ్రయర్‌ను పెట్టింది. కానీ అది ప్లగ్‌లోకి సరిగ్గా వెళ్లకపోగా, ఏదో అడ్డుపడినట్టుగా అనిపించింది. దీంతో ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. ఆ ప్లగ్ పాయింట్‌ను గట్టిగా పీకి చూసేసరికి ఇంకేముంది ఆమె అనుమానమే నిజమైంది. అందులో రహస్య కెమెరా అమర్చి ఉంది. షాక్ తిన్న ఆమె వెంటనే ఆడంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ అంతా పరిశీలిస్తే ఎక్కడ పడితే అక్కడే ఉన్న స్పై కెమెరాలు బయటపడ్డాయి. ప్లగ్ సాకెట్లలో మూడు కెమెరాలు, బల్బుల్లోపల రెండు కెమెరాలు, వార్డ్రోబ్ హ్యాంగర్లలో ఒక కెమెరా, గోడ గడియారాలలో మూడు కెమెరాలు, చివరికి బెడ్ రూమ్ కర్టెన్లలో కూడా రహస్య కెమెరాలు దొరకడంతో పోలీసు అధికారులే ఆశ్చర్యపోయారు. సంపత్ రాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్కడైనా ఉండొచ్చు జాగ్రత్త! ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ఎంత మంచి ఉందో, అంత ప్రమాదకరంగానూ మారుతోంది.అతి చిన్న సైజులో రహస్య కెమెరాలు తయారీ జరుగుతూ ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ వాటిని అమరుస్తున్నారు. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి ఇంటర్నెట్లో ఉంచుతామని బెదిరింపులు, ఆ సీడీలను అమ్ముకోవడం.. అదంతా ఒక విషవలయం. అందుకే అమ్మాయిలెవరైనా ఎక్కడికెళ్లినా ఒకటికి రెండు సార్లు స్పై కెమెరాలు ఉన్నాయేమోనని చెక్ చేసుకోవాలి. హాస్టల్స్‌లోనే కాక షాపింగ్ మాల్స్ ట్రయల్ రూమ్స్‌లో, హోటల్ రూమ్స్ ఇలా రహస్య కెమెరాలు ఎక్కడైనా ఉండొచ్చు. సరదాగా మీరు ఏ షాపింగ్ మాల్కో వెళితే గోడల మీద రంధ్రంలాంటి డిజైన్లు ఏమైనా కనిపిస్తే, కచ్చితంగా వాటిని అనుమానించాల్సిందే. ఆ రంధ్రాల మాటున రహస్య కెమెరా ఉండడానికి అవకాశం ఉంది. ఇక బయటకి సాధారణంగా కనిపించే ఎలక్ట్రికల్ సాకెట్లలో కూడా పెట్టే అతి సూక్ష్మమైన కెమెరాలు కూడా వచ్చేశాయి. బట్టలు పెట్టుకునే వంకీల మాదిరిగా ఉండే కెమెరాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. చివరికి ఎవరి ఊహకూ అందని రీతిలో మరుగుదొడ్లను శుభ్రం చేసే బ్రష్లలో కూడా స్పై కెమెరాలను అమరుస్తున్నారంటే ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం దృశ్యాలను చిత్రీకరించేవి మాత్రమే కాదు, వాయిస్ రికార్డు కెమెరాలు కూడా అమరుస్తున్నారు. ఈ కెమెరా లు చాలా వరకు రీచార్జ్ చేసుకునేవే. మనుషుల కదలికలు, మాటలకు ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే కెమెరాలు కూడా ఉన్నాయి. ఎక్కడికెళ్లినా ఎంత అప్రమత్తంగా ఉండాలో, స్పై కెమెరాలను ఎలా గుర్తించాలో అమ్మాయిలు నేర్చుకోవాలి. -
మద్యం తాగి ఉమెన్స్ హాస్టల్‌పై రాళ్లపై దాడి
-
ఉమెన్స్ హాస్టల్లో హైటెన్షన్
వైఎస్ఆర్ జిల్లా, వైవీయూ : కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఆ హాస్టల్ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలోనే కళాశాలకు అనుబంధంగా కోటిరెడ్డి రామసుబ్బమ్మ మహిళా హాస్టల్ ఉంది. కళాశాలలో 63 గదులు ఉండగా.. ఇందులో 370 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో చక్రాయపేట మండలం సురభి ప్రాంతానికి చెందిన రైతు పోతా నాగరాజు కుమార్తె అయిన గీతాంజలి అనే బీకాం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఒక్కసారిగా కళ్లు తిరిగి స్పృహ కోల్పోయింది. అదే సమయంలో ఆమెకు నరాలు బిగుసుకుపోయి ఫిట్స్ రావడంతో కళ్లు తేలేయడంతో.. విద్యార్థినులు భయభ్రాంతులకు గురై కేకలు వేశారు. విద్యార్థినిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కొందరు విద్యార్థినులు ప్రయత్నించగా.. కాపలాగా ఉండాల్సిన వాచ్మెన్ కళాశాల ప్రధాన గేటుకు తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో విద్యార్థినులకు ఏమి చేయాలో పాలుపోక హాస్టల్ కేర్‌టేకర్‌కు, డిప్యూటీ వార్డెన్లకు ఫోన్లు చేశారు. అంతలోపు కొందరు విద్యార్థినులు ధైర్యం చేసి విద్యార్థినిని ఓ టేబుల్‌పై వేసుకుని గేటు వరకు తీసుకెళ్లి 6 అడుగులకు పైగా ఉన్న గేటుపైకి అమ్మాయిలు ఎక్కి.. అవతలి వైపునకు దింపి వెంటనే కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థినులు రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంత జరుగుతున్నా అటువైపుగా హాస్టల్ డిప్యూటీ వార్డెన్, చీఫ్ వార్డెన్ రాకపోవడంతో విద్యార్థినుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనికి తోడు హాస్టల్ వాచ్‌మన్ తాత్కాలిక ఉద్యోగి కావడంతో తన బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని పలుమార్లు చెప్పినప్పటికీ.. అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థినులు పేర్కొన్నారు. గేటుకు తాళం వేసి... సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కళాశాలకు డేస్కాలర్ విద్యార్థులు, అధ్యాపకులు రావడం ప్రారంభించారు. అప్పటికే కళాశాల ప్రధాన గేటుకు హాస్టల్ విద్యార్థినులు తాళం వేసి లోపల బైఠాయించి ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు ప్రవేశించడంతో వ్యవహారం తీవ్రరూపం దాల్చింది. దీంతో ప్రిన్సిపాల్‌కు, వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థినుల ప్రాణాలు పోతే బాధ్యులెవరంటూ ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు. అప్పటికే పోలీసులు రంగప్రవేశం చేయడంతోపాటు ఇద్దరు విద్యార్థి సంఘ నాయకులను తీసుకెళ్లేందుకు యత్నించడంతో విద్యార్థినులు అడ్డుకున్నారు. దీంతో గేటు బయట మరికొందరు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని గేటును తోసుకువచ్చే యత్నం చేశారు. దీంతో గేటును గట్టిగా ఊపుతూ.. విద్యార్థి నాయకులను లోనికి రానివ్వరా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రిన్సిపాల్ వచ్చి సమాధానం చెప్పాలంటూ వారు పట్టుపట్టారు. దీంతో ప్రిన్సిపాల్ విద్యార్థి నాయకుల వద్దకు వచ్చి.. మీ దృష్టికి వచ్చిన సమస్యలను లిఖిత పూర్వకంగా రాసిస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం వన్‌టౌన్ సీఐ టి.వి. సత్యనారాయణ, తాలూకా సీఐ డి.భాస్కర్‌రెడ్డి పలుమార్లు విద్యార్థినులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో చర్చలు జరిపారు. వారి సమస్యలు ఏంటో తెలుసుకుని.. వాటిని పరిష్కరించాలని అధ్యాపక బృందానికి సూచించారు. దీంతో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ విద్యార్థినుల వద్దకు విచ్చేసి వారి డిమాండ్లను పరిష్కరిస్తామని.. విద్యార్థినులు పేర్కొన్న సమస్యలన్నింటినీ వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులు ప్రిన్సిపాల్ చాంబర్లో ప్రిన్సిపాల్‌తో మాట్లాడి వినతిపత్రం అందజేశారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఆందోళన కార్యక్రమాలతో కళాశాల అట్టుడికింది. కన్నీటి పర్యంతమైన తండ్రి అస్వస్థతకు గురైన విద్యార్థిని గీతాంజలిని ఆస్పత్రిలో చూసిన ఆమె తండ్రి నాగరాజు కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం ఏమీ లేకపోయినప్పటికీ.. కుమార్తెను అలా బెడ్‌పైన చూడగానే బాధను ఆపుకోలేకపోయాడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుమార్తెకు గతంలో ఎటువంటి ఫిట్స్ కానీ అనారోగ్య సమస్యలు కానీ లేవని తెలిపారు. అయితే ఎందుకిలా జరిగిందో కానీ.. సకాలంలో తోటి విద్యార్థినులే కాపాడారన్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధను వ్యక్తం చేశాడు. అనంతరం విద్యార్థినిని, ఆయన తండ్రిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుబ్బలక్షుమ్మ, అధ్యాపకులు, విద్యార్థినులు పరామర్శించారు. విద్యార్థినికి అయ్యే వైద్య ఖర్చులు భరిస్తామని.. ఎటువంటి ఆందోళన చెందవద్దని వారు ఓదార్చారు. అనంతరం ఖర్చుల నిమిత్తం కొంత మొత్తాన్ని అందజేశారు. -
ఉమెన్స్ హాస్టల్లో కూలిన పైకప్పు
హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్‌లో అభిశ్రీ ఉమెన్స్ హాస్టల్ పైకప్పు శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన భారీ గాలివానకు కూలిపోయింది. ఐదవ అంతస్తులో హాస్టల్ నిర్వాహకుడు రేకులతో షెడ్డు వేసి అందులో వసతి ఏర్పాటు చేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డువేసి తగిన రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతో గాలికి రేకులు ఎగిరిపోయాయి. ఐరన్ పోల్స్ కూలి విద్యార్థినులపై పడిపోయాయి. తెల్లవారుజామున నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా సుమారు 20 మంది విద్యార్థినుల సర్టిఫికెట్లు, బుక్స్ ఇతర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ఇంత జరిగినా హాస్టల్ నిర్వాహకుడు హాస్టల్‌కు రాకుండా ఉండడం గమనార్హం. దీంతో విద్యార్థినులు జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కార్వర్ట్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ వద్ద గోడ కూలిపోవడంతో మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. -
జెఎన్టీయూ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారెడ్డి కాలనీలో శుక్రవారం వెలుగు చూసింది. స్థానిక వసుంధర ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న అపర్ణ(28) గురువారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలమవడంతోనే ఇలా చేసి ఉంటుందని స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అపర్ణ హాస్టల్లో ఉంటూ జెన్ఎన్టీయూలోని ఇన్ఫో ప్లస్ టెక్నాలజీలో పనిచేస్తోంది. గురువారం రాత్రి గదిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం తలుపు తీయక పోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు వార్డెన్‌కు సమాచారం అందించారు. దీంతో తలుపులు పగలగొట్టి చూడగా.. గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లాంటివి ఏమైనా రాసిందా, లేక ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. -
నాగార్జున మహిళా హాస్టల్ వద్ద ఆగంతకుడి కలకలం
నాగార్జున యూనివర్సిటీ(గుంటూరు): నాగార్జున యూనివర్సిటీ మహిళా హాస్టల్ సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి కలకలం రేపాడు. మహిళా హాస్టల్ సమీపంలోని కరెంటు స్తంభంపైన రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉండటం హాస్టల్ లోపల ఉన్న విద్యార్థినులు గమనించారు. వారు వెంటనే ఆవిషయాన్ని భద్రతా సిబ్బందికి తెలియజేశారు. సెక్యూరిటీ అప్రమత్తమయ్యేలోగానే ఆ ఆగంతకుడు అక్కడి నుంచి వెంటనే దిగి పరారయ్యాడు. ఈ విషయమై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. కాగా, హాస్టల్ ప్రహరీకి సోలార్ ఫెన్సింగ్ ఉందని సమాచారం. -
సారూ.. ఎండుతోంది మా నోరు!
క్యాంపస్‌లో నీటి సమస్య తీవ్రమైంది. రోజువారీ అవసరాలకు కాదుకాదా... కనీసం తాగడానికి కూడా గుగ్గెడు నీరు కరువైంది. 48 గంటలుగా చుక్కనీరు రాకున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు మంగళవారం రాత్రి నిరసనకు దిగారు. సారూ... ఎండుతోంది నోరు... మమ్మల్ని కాస్త పట్టించుకోరూ.. అంటూ నినాదాలు చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం ఎస్వీయూ బంద్‌కు పిలుపునిచ్చారు. - రెండు రోజులుగా మహిళా హాస్టల్లో నీటికొరత - మంగళవారం రాత్రి విద్యార్థులు ఆందోళన - నచ్చజెప్పే ప్రయత్నం చేసిన రిజిస్ట్రార్ - శాంతించని విద్యార్థినులు, నేడు ఎస్వీయూ బంద్ యూనివర్సిటీక్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ మహిళా హాస్టల్లో రెండు రోజులుగా నీటికొరత తీవ్రమైంది. మంగళవారం చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి. తాగడానికి, బాత్రూమ్లో వాడకానికి నీరు లేవు. దీంతో మంగళవారం రాత్రి భోజనం తినేందుకు కూడా చుక్కనీరు లేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థునులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. ప్రకాశం భవన్‌కు వెనుకవైపున ఉన్న మహిళ హాస్టళ్ల సముదాయ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి నినాదాలు చేశారు. చాలారోజులగా హాస్టల్లో ఇదే పరిస్థితి ఉన్నా.. వార్డన్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 1000 మంది ఉన్న హాస్టల్లో 9 మంది తాగునీటి కుళాయిలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అలాగే గదికి ఇద్దరు ఉండాల్సిన రూముల్లో 7 నుంచి 9 మందికి కేటాయించారని చెప్పారు. దోమల భాద ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్లో భోజనం సరిగా లేదని ఆరోపించారు. వార్డన్‌ను తొలగించాలని డిమాండ్ చేశా రు. 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. మహి ళా హాస్టల్లో ఈ తరహా ఆందోళన జరగడం ఇదే మొదటిసారి. దీంతో రిజిస్ట్రార్ దేవరాజులు, హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులతో చర్చించారు. అయినా వారు శాంతించలేదు. దీంతో ఆయన నీరు తెప్పించే ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ అంశంపై వార్డన్ శకుంతల మాట్లాడుతూ నీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు హేమంత్ యాదవ్, తేజ, కిశోర్, హేమంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సమస్యల పరిష్కరానికి బుధవారం పరిపాలనాభవనం వద్ద ఆందోళన చేస్తున్నట్లు , యూనివర్సిటీలో బంద్ పాటిస్తున్నట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. -
ఆ విశ్వవిద్యాలయంలో చుక్కనీరు ఉంటే ఒట్టు
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీ మహిళా హాస్టల్లో రెండు రోజులుగా నీటికొరత తీవ్రంగా ఉంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి. తాగడానికి, బాత్రూమ్లో వాడకానికి నీరు లేవు. దీంతో మంగళవారం రాత్రి భోజనం తినేందుకు కూడా చుక్కనీరు లేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థునులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. ప్రకాశం భవన్‌కు వెనుకవైపున ఉన్న మహిళ హాస్టళ్ళ సముదాయ ప్రాంగణంలో విద్యార్థులు బైఠాయించి విద్యార్థులు ఆందోళన చేశారు. హాస్టల్‌కు తీవ్ర నీటి కొరత ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చాలారోజుల నుంచి హాస్టల్లో ఇదే పరిస్థితి ఉందని వార్డన్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 1000 మంది ఉన్న హాస్టల్లో 9 మంది మాత్రమే తాగునీటి కుళాయిలు ఉన్నాయని చెప్పారు. అలాగే గదికి ఇద్దరు ఉండాల్సిన రూముల్లో 7 నుంచి 9 మందికి కేటాయించారని చెప్పారు. దోమల భాద ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్లో భోజనం సరిగా లేదని ఆరోపించారు. సమస్యలను ఎన్నిసార్లు వార్డన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని చెప్పారు. వార్డన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన కొనసాగింది. మహిళా హాస్టల్లో ఈ తరహా ఆందోళన జరగడం ఇదే మొదటిసారి. విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో రిజిస్ట్రార్ దేవరాజులు, హాస్టల్ ప్రాంగణానికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు శాంతించలేదు. దీంతో ఆయన నీరు తెప్పించే ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ అంశంపై వార్డన్ శకుంతల మాట్లాడుతూ నీటి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. నీటి కొరత విషయంలో తానేమీ చేయలేనిని పేర్కొన్నారు. -
ఉమెన్స్ హాస్టల్లో యువకులా?
గుంటూరు: ఉమెన్స్ హాస్టల్లో యువకులు పనిచేయటమా? ఇక్కడ పనిచేసేందుకు మహిళలు దొరకలేదా.. అసలు వీరిని ఎవరు నియమించారు, ఎప్పుడు నియమించారు అంటూ ఇన్చార్జి వీసీ బి.ఉదయలక్ష్మి మండిపడ్డారు. వెంటనే ఇక్కడి నుంచి వీరిని మార్చండి అని రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌ను ఆదేశించారు. ఇన్చార్జి వీసీగా హోదాలో యూనివర్సిటీకి వచ్చిన ఉదయలక్ష్మి ఉమెన్స్ హాస్టల్‌ను సందర్శించారు. భోజనశాలలో భోజనం చేస్తున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి వసతులెలా ఉన్నాయి, భోజనాలు బాగుంటున్నాయా అని అడిగారు. విద్యార్థినులు సమాధానమిస్తూ భోజనం బాగోడం లేదని, తమకంటే సిబ్బంది ముందుగా తింటున్నారని తమకు సరిగా పెట్టడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు చెప్పేది నిజమేనని సిబ్బంది పనితీరు బాగోలేదని చీఫ్ వార్టెన్ జయశ్రీ కూడా ఇన్చార్జి వీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని పిలిచిన ఇన్చార్జి వీసీ ఇంతకు ముందులా ఉండదని, సరిగా చేయకపోతే సస్సెండ్ చేస్తానని హెచ్చరించారు. భోజనం, శుభ్రతపై ప్రశ్నిస్తున్నందుకు తనను సిబ్బంది అందరూ కలిసి బెదిరించారని తాను ఎంతో వేదన చెందానని ఎల్ఎల్ఎం విద్యార్థిని కిరణ్ విలపిస్తూ ఇన్చార్జి వీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే హాస్టల్ ఇన్‌చార్జ్‌లు, సిబ్బందిని పిలిపించిన ఉదయలక్ష్మి విద్యార్థినిని ఎందుకు బెదిరించారని వారిని ప్రశ్నించారు. మరొకసారి ఇలా జరిగితే ఊరుకోనని స్పష్టం చేశారు. విద్యార్థిని పిర్యాదు చేస్తుండగా సూపర్ వైజర్ కలుగజేసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికందరికీ నోటీసులు జారీ చేసి వివరణ అడగాలని, సూపర్వైజర్లు ఇద్దరినీ మార్చాలని రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌కు సూచించారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రత్యేకంగా డ్రస్ వేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జంట్స్ హాస్టల్‌ను సందర్శించి వసతులను పరిశీలించారు. అందులో పనిచేస్తున్న పెద్దవయసున్న పురుషులను ఉమెన్స హాస్టల్‌కు మార్చాలని అధికారులకు సూచించారు. వసతి గృహ వ్యవహారాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఇన్చార్జి వీసీ వెంట పలువురు యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది ఉన్నారు. సిబ్బంది బదిలీకి రంగం సిద్ధం ఇన్చార్జి వీసీ ఆదేశాలతో వసతి గృహాల్లో పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేసేందుకు యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమెన్స హాస్టల్లోని ఇన్చార్జిలతోపాటు అక్కడ పనిచేసే సిబ్బందిని మారుస్తున్నారు. ఉమెన్స హాస్టల్స్ చీఫ్ వార్డెన్ జయశ్రీ గురువారం రాత్రి రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌తో సమావేశమై దీనిపై చర్చించారు. -
కేయూ ఉమెన్స్ హాస్టల్లో ర్యాగింగ్ !
కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీలోని ఉమెన్స్ హాస్టల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పింది. మూడురోజుల క్రితం హాస్టల్లో బీ ఫార్మసీ సెకండియర్ విద్యార్థినులు బీఫార్మసీ ఫస్టియర్ విద్యార్థినులను ర్యాగింగ్ చేసినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం బీఫార్మసీలో చేరిన విద్యార్థినుల్లో కొందరు ఉమెన్స్‌హాస్టల్‌లో ఉంటున్నారు. వారిని సీనియర్లు తమ గదులకు పిలిపించుకుని పరిచయాల పేరిట రాత్రివేళ ర్యాగింగ్‌కు పాల్పడడం, వారి వికృత చేష్టలతో మాటలతో ఆయా విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేయడం బాధితుల తల్లిదండ్రులకు తెలిసింది. వారు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్పందించిన కేయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి సీనియర్, జూనియర్ విద్యార్థినులను పిలిపించి మూడు రోజుల క్రితం మాట్లాడారు. ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కళాశాల, హాస్టల్ నుంచి కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆరుగురు సెకండియర్ విద్యార్థినులు మళ్లీ తాము జూనియర్లను ర్యాగింగ్‌కు పాల్పడబోమని ప్రిన్సిపాల్‌కు అండర్ టేకింగ్ ఇచ్చినట్లు తెలిసింది. కొన్నేళ్ల క్రితం కూడా ఉమెన్స్ హాస్టల్లో బాటనీ విభాగానికి చెందిన పలువురు సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ర్యాగింగ్ చేయగా వారిపై పోలీస్ కేసు నమోదైంది. ఆ తర్వాత వారిని ఉమెన్స్ హాస్టల్ నుంచి వారిని సస్పెండ్ చేశారు. మళ్లీ ఇప్పుడు ఫార్మసీ సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. క్యాంపస్‌లోని యాంటీర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాత్రివేళల్లో హాస్టళ్లలో ఈ కమిటీలు పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. కాగా ఈ విద్యాసంవత్సరంలో ఫార్మసీ విద్యార్థులకు ర్యాగింగ్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి యోచిస్తున్నారు.