సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజీలో మ హిళా హాస్టల్ ఏర్పా టుచేయాలన్న విద్యా ర్థిసంఘాల డిమాండ్ నేపథ్యంలో దాని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారుల ను విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించా రు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రవీందర్, కాలేజీ విద్య కమిషన్ నవీన్‌మిట్టల్ సహా పలువురు అధికారులతో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు.
నిజాం కాలేజీలో హాస్టల్ ఏర్పాటుపై వచ్చిన డిమాండ్ ఎంత వరకు సమంజసమో పరిశీలించి నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు. ఈ డిమాండ్ లేవ నెత్తిన విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సంప్ర దించాలన్నారు. నిజాం కాలేజీలో డిగ్రీ చదువు తున్న బాలురకు ఏళ్లుగా హాస్టల్ సౌకర్యం ఉందని, కానీ బాలికలకు అక్కడ హాస్టల్ సదు పాయం లేదని అధికారులు మంత్రికి వివరించారు. హాస్టల్ ఏర్పాటు చేసే స్థలం కూడా లేదని అధికారులు తెలిపినట్లు సమాచారం.
చదవండి: కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment