జెఎన్టీయూ ఉద్యోగిని ఆత్మహత్య | jntu student commits suicide in hostel rome | Sakshi
Sakshi News home page

జెఎన్టీయూ ఉద్యోగిని ఆత్మహత్య

Published Fri, Jan 8 2016 9:50 AM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM

జెఎన్టీయూ ఉద్యోగిని ఆత్మహత్య - Sakshi

జెఎన్టీయూ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారెడ్డి కాలనీలో శుక్రవారం వెలుగు చూసింది. స్థానిక వసుంధర ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న అపర్ణ(28) గురువారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ విఫలమవడంతోనే ఇలా చేసి ఉంటుందని స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
వివరాలు.. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అపర్ణ హాస్టల్‌లో ఉంటూ జెన్ఎన్టీయూలోని ఇన్ఫో ప్లస్ టెక్నాలజీలో పనిచేస్తోంది. గురువారం రాత్రి గదిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం  తలుపు తీయక పోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు వార్డెన్‌కు సమాచారం అందించారు. దీంతో తలుపులు పగలగొట్టి చూడగా.. గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ లాంటివి ఏమైనా రాసిందా, లేక ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement