సనత్‌నగర్: యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ (ఉస్మానియా యూనివర్సిటీ) ఉమెన్స్ హాస్టల్‌లోకి శుక్రవారం రాత్రి ముగ్గురు ఆగంతకులు చొరబడి హంగామా సృష్టించారు. హాస్టల్ కిటికీలు తొలగించి లోపలికి ప్రవేశించడంతో విద్యారి్థనులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వెంటనే అప్రమత్తమై ముగ్గురిలో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
వివరాలు ఇలా ఉన్నాయి.. ప్యారడైజ్ సమీపంలోని వాటర్‌వర్క్స్ కార్యాలయంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేసే శ్రీకాంత్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు మద్యం తాగి శుక్రవారం అర్ధరాత్రి పీజీ కాలేజ్ హాస్టల్ వద్దకు వచ్చారు. కిటికీలను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. విద్యారి్థనులు పట్టుకునేందుకు ప్రయత్నించగా శ్రీకాంత్ ఒక్కడే చిక్కడంతో 100కు సమాచారం అందించారు. బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మిగతా ఇద్దరు నిందితుల పేర్లను శ్రీకాంత్ వెల్లడించడం లేదు.
ఆందోళన.. ఉద్రిక్తత..
తమకు రక్షణ కరువైందంటూ హాస్టల్ విద్యారి్థనులు శనివారం ఆందోళనకు దిగారు. వీసీ వచ్చి హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా అంటూ ధర్నా కొనసాగించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హాస్టల్‌లోసీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, స్టాటి క్ సెక్యూరిటీ ఫోర్స్ నియమించాలని, రెండు కిటికీలను మరమ్మతులు చేయించాలని, ప్రహరీగోడ ఎత్తు పెంచాలనే డిమాండ్లను వ్యక్తంచేశారు. నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ రామలింగరాజు, సీఐ భాస్కర్‌లు పరిస్థితిని సమీక్షించి యూని వర్సిటీ అధికారులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ రవికుమార్‌తో కలిసి డీసీపీ రోహిణి ప్రియదర్శిని విద్యారి్థనులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment