
బాబూరావు సస్పెన్షన్
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న రిషికేశ్వరి ఆత్మహత్యపై ఏపీ ఉన్నత విద్యా మండలి స్పందించింది. ప్రిన్సిపాల్ బాబూరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈమేరకు ఉన్నత విద్యా మండలి గురువారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బాబూరావు వైఖరిపై పోలీసులు, నిజనిర్ధారణ కమిటీలు విచారణ సాగిస్తున్నాయి.
రిషికేశ్వరి జూలై 14న హాస్టల్‌లోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ర్యాగింగ్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని మొదట భావించారు. తర్వాత దిగ్బ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. దీంతో స్పందించిన ఉన్నత విద్యా మండలి రిషికేశ్వరి ఆత్మహత్య కేసును సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.