ఏపీ పీసెట్ షెడ్యూల్ విడుదల
ఆంధ్ర విశ్వవిద్యాలయం: రాష్ట్ర వ్యాప్తంగా వ్యాయామ విద్యా కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరంలో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తున్న పీసెట్- 2015 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డి విడుదల చేశారని పీసెట్ కన్వీనర్, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్ ఆచార్య వై.కిషోర్ తెలిపారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన పీసెట్ కమిటీ సమావేశంలో పీసెట్ షెడ్యూల్ ఖరారు చేశామని తెలిపారు. నోటిఫికేషన్ ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుందనీ, దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 30 ఆఖరు తేదీ అని, అపరాధ రుసుముతో ఏప్రిల్ 13వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు ఈ ఏడాది మే నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు మే నెల 7వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.