నాగార్జున వర్శిటీలోనే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు
* శాసనసభ స్పీకర్ కోడెల వెల్లడి
* ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత 15 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీలో నిర్వహించనున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. శాసన సభ అధికారులు, ఎమ్మెల్యేలు, యూనివర్సిటీ అధికారులతో కలిసి ఆయన సోమవారం వర్సిటీ భవనాలను పరిశీలించారు.డైక్‌మన్ ఆడిటోరి యం అసెంబ్లీ నిర్వహణకు అనుకూలమైనదిగా గుర్తించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆడిటోరియంలో స్వల్ప మార్పులు చేసి అసెంబ్లీగా వాడుకోవచ్చని తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాక భద్రత, సభ్యులకు వసతి తదితర ఏర్పాట్లు పూర్తిచేస్తామని చెప్పారు. విజయవాడ, గుంటూరుల్లో ఎమ్మెల్యేల కు బస ఏర్పాట్లు చేస్తామన్నారు.
వచ్చే నెల 17 నుంచి 20 వరకు అసెంబ్లీ!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు వచ్చే నెల 17 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీలోని డైక్‌మన్ హాలులో జరుగుతాయి. శాసనమండలి సమావేశాలు కూడా ఇదే హాలుకు అనుబంధంగా ఉన్న సమావేశ మం దిరంలో జరుగుతాయి. డిసెంబర్ తొలి వారంలో అయితే పదిరోజులు జరగవచ్చు.
స్టేట్ గెస్ట్ హౌస్‌లో సీఎంకు బస
సీఎంకు విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.