రిషితేశ్వరి ఆత్మహత్య అనంతరం డైరీలోని ఓ పేజీలో ఆమె ‘మై లాస్ట్ నోట్’ పేరుతో రాసిన సూసైడ్ నోట్ మాత్రమే పోలీసులు బహిర్గతం చేశారు. అయితే, మిగతా పేజీలను ఎందుకు బయటపెట్టలేదనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఏ సందర్భంలో ఆమెకు బాధ కలిగిందో, ఎప్పుడు మనోవేదనకు గురైందో తెలుపుతూ ఆమె మరో ఐదు పేజీలు తన డైరీలో రాసుకుంది. సూసైడ్ నోట్‌తోపాటు ఆ ఐదు పేజీలూ డైరీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. చివరకు ఆమె తల్లిదండ్రులు సైతం తమకు పోలీసులు ఈ డైరీని చూపలేదని చెబుతున్నారు. ఆ పేజీల్లో రిషితేశ్వరి ఐదుగురు విద్యార్థులు తనను వేధించినట్లు రాసింది. డైరీ పేజీల్లో వారి పేర్లు రాసి ఉన్నప్పటికీ.. ఆ పేర్లు కొట్టేసి ఉన్నాయి. రిషితేశ్వరి కొట్టేసి ఉంటుందనుకుంటే అప్పటి వరకూ బ్లూ ఇంక్‌తో రాసిన పేర్లను అదే ఇంకుతో కొట్టేసి, ‘మిస్టర్‌ఎక్స్’ అని రెడ్ ఇంక్‌తో ఎందుకు రాస్తుందనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ పేర్లు ఎవరు కొట్టేశారనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి.
Published Wed, Aug 5 2015 10:56 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement