85 కిలోమీటర్లు 38 నిమిషాల్లో ముగించింది | Talgo clocks 180 km per hour, completes Mathura-Palwal journey in 38 minutes | Sakshi
Sakshi News home page

85 కిలోమీటర్లు 38 నిమిషాల్లో ముగించింది

Published Thu, Jul 14 2016 1:03 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

85 కిలోమీటర్లు 38 నిమిషాల్లో ముగించింది

85 కిలోమీటర్లు 38 నిమిషాల్లో ముగించింది

మధుర: భారతీయ రైల్వేలో ఇప్పటి వరకు ఉన్న అత్యధిక వేగాన్ని స్పెయిన్ నుంచి తీసుకొచ్చిన టాల్ గో ట్రైన్ అధిగమించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు మధుర-పాల్వాల్ మధ్య ప్రయాణాన్ని 38 నిమిషాల్లో ముగించింది. రెండోసారి నిర్వహించిన ఈ ట్రయల్ లో ఇప్పటి వరకు భారత్ లో అత్యధిక వేగంగా వెళ్లే గతిమాన్ (గంటకు 160 కిలోమీటర్ల వేగం) రికార్డును ఇది చెరిపివేసింది.

స్పెయిన్ నుంచి ఉత్తర మధ్య రైల్వే విభాగం ఈ రైలును దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ రైలు పనితీరుపై ట్రయల్స్ వేస్తున్నారు. అందులో భాగంగా రెండుసార్లు ఖాళీ రైలుతో ట్రయల్ వేశారు. మరికొన్నిసార్లు ఇసుక బస్తాలు వేసి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ టాల్గోఘో మోస్తరు వేగం గంటకు 160 నుంచి 250 కిలో మీటర్లు ఉండగా.. అత్యధిక వేగం 350 కిలోమీటర్లు ఉండనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement