Talgo train
-
మెట్రో నగరాల్లో టాల్గో రైళ్లు!
న్యూఢిల్లీ: స్పెయిన్‌లో తయారయ్యే టాల్గో రైళ్లను మనదేశంలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. టాల్గో రైలు ఆదివారం చివరిపరీక్షను ఎదుర్కొని ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం 12 గంటల్లోనే చేరుకోవడం తెలిసిందే. ఈ రైలు భారత్‌లో విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తిచేసుకోవడంతో మెట్రో నగరాల మధ్య వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ అనుకుంటోంది. అయితే టాల్గో బోగీలను యథాతథంగా భారత్‌లో ప్రవేశపెట్టలేమనీ, మన దేశ అవసరాలు, ప్లాట్‌ఫాంల ఆకృతికి తగ్గట్టు స్వల్ప మార్పులు చేయాలని రైల్వే వర్గాలు తెలిపాయి. టాల్గో రైలు బోగీలు అల్యూమినియంతో తయారై, తక్కువ బరువు, ఎక్కువ వేగం కలిగి ఉంటాయి. ‘తేలికగా ఉండే అల్యూమినియం రైలు బోగీలను మన రైల్వేలో ప్రవేశపెట్టడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను మేం పరిశీలిస్తున్నాం’ అని రైల్వే బోర్డు సభ్యుడు హేమంత్ కుమార్ చెప్పారు. ఇప్పుడున్న పట్టాలపైనే రైళ్లను మరింత వేగంగా ఎలా నడపగలమో ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుత టాల్గో రైలుకు బోగీలు మాత్రమే స్పెయిన్ నుంచి వచ్చాయి. ఇంజిన్ భారతీయ రైల్వేదే వాడుతున్నారు. ఇప్పటికి గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో రైలును నడిపారు. బోగీల రవాణా ఖర్చును కూడా స్పెయినే భరించి బోగీలను ఇక్కడకు పంపింది. -
దూసుకొస్తున్న హైస్పీడ్ టాల్గో రైలు
-
దూసుకొస్తున్న హైస్పీడ్ టాల్గో రైలు
న్యూఢిల్లీ: హైస్పీడ్ స్పానిష్ టాల్గో రైలు ట్రయిల్ రన్ విజయవంతమైంది. న్యూఢిల్లీ నుంచి ముంబై సెంట్రల్ రెల్వే స్టేషన్ కు 12 గంటల్లోపు చేరుకుంది. 11 గంటల 48 నిమిషాల్లో ముంబైకు చేరుకుందని రైల్వే శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 1384 కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరిన టాల్గో రైలు ఆదివారం తెల్లవారుజామున 2.33 గంటలకు ముంబై చేరుకుందని వివరించారు. ఇదే మార్గంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ కు 130 కిలోమీర్ల వేగంతో ప్రయాణించడానికి 15 గంటల 50 నిమిషాలు పట్టింది. ముందు నిర్వహించిన ఐదు ట్రయల్ రన్ లో టాల్గో రైలు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. బుల్లెట్ లా దూసుకుపోయే హైస్సీడ్ రైలు మన దేశంలో పట్టాలెక్కడానికి రెండుమూడేళ్లు పడుతుంది. -
కొన్ని సవరణల తర్వాత మాత్రమే టాల్గో రన్
న్యూఢిల్లీ: స్పానిష్ టాల్గో రైలు ట్రయిల్ రన్ విజయవంతమైందని రైల్వే శాఖ బుధవారం ప్రకటించింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే స్పెయిన్ రూపొందించిన హైస్పీడ్ టాల్గో ట్రెయిన్ కొన్ని స్వల్ప మార్పులతో తన సేవలను ప్రారంభించనుందని రైల్వే శాఖ తెలిపింది. కొన్ని సవరణల తర్వాత , ఆపరేషనల్ బేసిస్ గా టాల్గో సర్వీసులు అందుబాటులో ఉంచనున్నట్టు రైల్వే రోలింగ్ స్టాక్ సభ్యుడు హేమంత్ కుమార్ చెప్పారు. టాల్గో ట్రయిల్ రన్ విజయవంతమైనప్పటికీ తక్కువ వెడల్పు, ఎత్తు తక్కువ ఉన్న ఫూట్ బోర్డ్ తదితర అంశాల కారణంగా భారత రైల్వే సేవల్లో ఇపుడే చేరదని చెప్పారు. ముంబై ఢిల్లీ మధ్య గంటకు 150 కి.మీ వేగాన్ని అధిగమించే ట్రయిల్ రన్స్ నిర్వహిస్తున్నామని, ఫైనల్ రన్ ఆగస్ట్ 14 న ఉంటుందని చెప్పారు. తాజాగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ట్రయల్ రన్లో భాగంగా ఢిల్లీ నుంచి ముంబైకి 1389 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల పది నిమిషాల్లో చేరుకుంది టాల్గో. ఇది రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే 3 గంటల 40 నిమిషాల సమయం తక్కువగా తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ మధ్య వేగవంతమైన రైలుగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ దూరాన్ని చేరుకోవడానికి 15 గంటల 50 నిమిషాల సమయం తీసుకుంటోంది. అయితే మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన టాల్గో రైలు బుధవారం తెల్లవారుఝామున 2.55 గంటలకు ముంబై చేరుకున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. ముంబై, ఢిల్లీ మధ్య ప్రయాణ సమయాన్ని 12 గంటలకే పరిమితం చేయాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు భావిస్తున్నారు. గతవారం అత్యధికంగా 130కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న టాల్గో.. ఇదే దూరాన్ని 12 గంటల 50 నిమిషాల్లో చేరుకుంది. కాగా మే 29 నుంచి ఈ రైలు ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. తొలి టాల్గో ట్రయల్ రన్ యూపీలోని బరేలి-మొరదాబాద్‌ల మధ్య గంటకు 115 కి.మీ వేగంతో జరగ్గా, పల్వాల్-మధుర మధ్య గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. -
భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..!
-
85 కిలోమీటర్లు 38 నిమిషాల్లో ముగించింది
మధుర: భారతీయ రైల్వేలో ఇప్పటి వరకు ఉన్న అత్యధిక వేగాన్ని స్పెయిన్ నుంచి తీసుకొచ్చిన టాల్ గో ట్రైన్ అధిగమించింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ రైలు మధుర-పాల్వాల్ మధ్య ప్రయాణాన్ని 38 నిమిషాల్లో ముగించింది. రెండోసారి నిర్వహించిన ఈ ట్రయల్ లో ఇప్పటి వరకు భారత్ లో అత్యధిక వేగంగా వెళ్లే గతిమాన్ (గంటకు 160 కిలోమీటర్ల వేగం) రికార్డును ఇది చెరిపివేసింది. స్పెయిన్ నుంచి ఉత్తర మధ్య రైల్వే విభాగం ఈ రైలును దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ రైలు పనితీరుపై ట్రయల్స్ వేస్తున్నారు. అందులో భాగంగా రెండుసార్లు ఖాళీ రైలుతో ట్రయల్ వేశారు. మరికొన్నిసార్లు ఇసుక బస్తాలు వేసి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ టాల్గోఘో మోస్తరు వేగం గంటకు 160 నుంచి 250 కిలో మీటర్లు ఉండగా.. అత్యధిక వేగం 350 కిలోమీటర్లు ఉండనుంది. -
తాల్గో రైలు వేగం@115
ట్రయల్ రన్ నిర్వహించిన రైల్వే శాఖ బరేలీ: దేశంలో రైళ్ల వేగాన్ని పెంచే వ్యూహంలో భాగంగా రైల్వే శాఖ స్పెయిన్ తయారీ తాల్గో రైలు తొలి ట్రయల్ రన్‌ను నిర్వహించింది. ఈ రైలు తేలికగా ఉండటంతోపాటు గంటకు 115 కి.మీ వేగంతో పరుగులు తీయగలదు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి మొరాదాబాద్ వరకు తాల్గో రైలు ట్రయల్ రన్‌ను సాఫీగా నిర్వహించారు. 4,500 హెచ్‌పీ సామర్థ్యమున్న డీజిల్ ఇంజన్‌కు 9 తాల్గో బోగీలను తగిలిం చారు. బరేలీలో ఉదయం 9.05 గంటలకు బయలుదేరిన ఈ రైలు 10.15 గంటలకు మొరాదాబాద్ చేరింది. గంటకు 110-115 కి.మీ వేగంతో 90 కి.మీ. దూరాన్ని 70 నిమిషాల్లో చేరిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ-ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ సగటు వేగం గంటకు 85 కి.మీ. ఉంది. తాల్గో రైళ్లు తేలిగ్గా ఉండటం వల్ల 30 శాతం ఇంధనాన్ని ఆదాచేస్తుంది. 9 బోగీల్లో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్, నాలుగు చైర్ కార్లు, కేఫెటేరియా, పవర్ కార్, సిబ్బంది-పరికరాలున్న బోగీలున్నాయి. ఒక్క ట్రయల్న్త్రోనే దీనిపై అంచనాకు రాలేమని, ఇంకా మూడుసార్లు నిర్వహిస్తామని రైల్వే శాఖ పరిశోధన డిజైన్లు, ప్రమాణాల సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ హమీద్ అఖ్తర్ చెప్పారు. తర్వాత మథుర-పల్వాల్ మార్గంలో 40 రోజులపాటు 180 కి.మీ. వేగంతో ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు.తాల్గో కంపెనీ సెమీ-హైస్పీడ్ (గంటకు 160-250 కి.మీ.), హైస్పీడ్ (350 కి.మీ.) ప్యాసింజర్ రైళ్లను తయారుచేస్తుంది.