
దూసుకొస్తున్న హైస్పీడ్ టాల్గో రైలు
న్యూఢిల్లీ: హైస్పీడ్ స్పానిష్ టాల్గో రైలు ట్రయిల్ రన్ విజయవంతమైంది. న్యూఢిల్లీ నుంచి ముంబై సెంట్రల్ రెల్వే స్టేషన్ కు 12 గంటల్లోపు చేరుకుంది. 11 గంటల 48 నిమిషాల్లో ముంబైకు చేరుకుందని రైల్వే శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో 1384 కిలోమీటర్లు ప్రయాణించిందని తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి బయలు దేరిన టాల్గో రైలు ఆదివారం తెల్లవారుజామున 2.33 గంటలకు ముంబై చేరుకుందని వివరించారు.
ఇదే మార్గంలో రాజధాని ఎక్స్ప్రెస్ కు 130 కిలోమీర్ల వేగంతో ప్రయాణించడానికి 15 గంటల 50 నిమిషాలు పట్టింది. ముందు నిర్వహించిన ఐదు ట్రయల్ రన్ లో టాల్గో రైలు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. బుల్లెట్ లా దూసుకుపోయే హైస్సీడ్ రైలు మన దేశంలో పట్టాలెక్కడానికి రెండుమూడేళ్లు పడుతుంది.