మళ్లీ ట్రయల్న్ | Chennai Metro rail to be tested on elevated corridor | Sakshi
Sakshi News home page

మళ్లీ ట్రయల్న్

Published Fri, Jan 3 2014 12:36 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

Chennai Metro rail to be tested on elevated corridor

 చెన్నై, సాక్షి ప్రతినిధి:మెట్రోరైల్ ప్రయాణపు అనుభవాలను ఆస్వాదించేందుకు నగర ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చడమేగాక నగరానికి మరింత శోభను చేకూర్చే మెట్రోరైలు నిర్మాణ పనులు ముమ్మురంగా సాగుతున్నాయి.  14,500 కోట్ల అంచనాతో ఆరంభించిన మెట్రోరైల్ ప్రాజెక్టును 2015 నాటికి సిద్ధం చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతకంటే ముందుగానే అందిస్తామని మెట్రో అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాకలిపేట- మీనంబాకం ఎయిర్‌పోర్టు వరకు 22.1 కిలోమీటర్లు, చెన్నై సెంట్రల్- పరంగిమలై వరకు 22 కిలోమీటర్లతో మొత్తం 45.1 కిలో మీటర్ల పొడవున రెండు మార్గాల్లో నిర్మాణం జరుపుకుంటోంది. చాకలిపేట-సైదాపేట వరకు 11 రైల్వేస్టేషన్లతో సొరంగమార్గం, ఆరు రైల్వే స్టేషన్లతో సైదాపేట-మీనంబాకం వరకు ఆకాశవంతెన మార్గం సిద్ధమవుతోంది. సెంట్రల్- అన్నానగర్ టవర్ వరకు సొరంగమార్గం, తిరుమంగళం నుంచి కోయంబడే, వడపళని, అశోక్‌నగర్, ఈక్కాడు తాంగల్ వరకు ఆకాశవంతెన మార్గంలో రైలు ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో 8 రైల్వే స్టేషన్లు సిద్ధమవుతున్నాయి.
 
 తొలి, మలి ట్రయల్ రన్ 
 నాలుగు బోగీలతో కూడిన మెట్రోరైలు బ్రెజిల్ నుంచి ఆరు నెలల క్రితమే చెన్నై చేరుకోగా 800 మీటర్ల ట్రయల్న్‌న్రు గత ఏడాది నవంబరు 6వ తేదీన నిర్వహించారు. రిమోట్ కంట్రోలు ద్వారా సచివాలయం నుంచే అన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కానిచ్చే సీఎం జయలలిత నేరుగా హాజరై ట్రయల్న్‌క్రు జెండా ఊపారు. రైలు బోగీలోకి ఎక్కి వసతులను పరిశీలించారు. 2014వ సంవత్సరంలో కోయంబేడు-పరంగిమలై (సెయింట్ థామస్ మౌంట్) నడుమ ప్రయాణికుల కోసం మెట్రోరైలు పరుగులు పెడుతుందని ట్రయల్న్ నాడే అధికారులు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా ఫిబ్రవరిలో మళ్లీ పాతమార్గంలోనే ట్రయల్న్‌క్రు సిద్ధమవుతున్నారు. అయితే గత ఏడాది కేవలం 800 మీటర్లు మాత్రమే ట్రయల్న్ సాగింది. ఈ సారి 11 కిలోమీటర్ల దూరం వరకు అంటే రెండు ప్రధాన రైల్వే స్టేషన్ల నడుమ ట్రయల్న్ నిర్వహించనున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement