Metrorail Project
-
వైఎస్సార్ కృషివల్లే మెట్రో : రఘువీరా
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషివల్లే హైదరాబాద్ నగరానికి ఈ రోజు మెట్రో రూపుదిద్దుకుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఈ విషయంలో తన పోరాటం వల్లే హైదరాబాద్‌కు మెట్రోరైల్ ప్రాజెక్టు వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఏ మంచి జరిగినా తానే చేశానని, చెడు జరిగితే ప్రతిపక్షాలకు ఆపాదించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. మెట్రోరైల్ ప్రాజెక్టును ప్రతిపాదించి దానికి చెందిన పనులను ప్రారంభించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు. దీనికోసం వైఎస్ ఎంతో కృషి చేశారన్నారు. -
ఈ కేటాయింపులు ఏ మూలకు
ఐఐఎంకు రూ.40 కోట్లు ఉన్నత విద్యాసంస్థ నిర్వహణకు సరిపడని నిధులు మెట్రోరైలుకు రూ.5.3కోట్లు వేతన జీవులకు నిరాశ ఏయూక్యాంపస్: కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో విశాఖ నగరంలో ఐఐఎం ఏర్పాటుకు, మెట్రోరైల్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు కేవలం కంటితుడుపుగా నిలుస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఈ రెండు వ్యవస్థలు ఏర్పాటుచేయడానికి ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవు. విశాఖలో గంభీరంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ఐఐఎంకు 40 కోట్లు కేటాయించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి విశాఖలో ప్రవేశాలు కల్పించాలని, తాత్కాలికంగా ఏయూలో దీనిని ఏర్పాటుచేయాలని గతంలో నిర్ణయించారు. గంభీరంలో నూతన క్యాంపస్‌కు కేంద్ర మావన వనరుల శాఖమంత్రి స్మృతి ఇరాని ఇటీవల శంకుస్థాపన చేశారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐఎం రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయాలంటే తక్షణం కొన్ని మౌలిక వసతులు, మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వీటికి కోట్ల రూపాయలు వెచ్చించాలి. ప్రస్తుతం కేంద్రం విదిల్చిన 40 కోట్లు తాత్కాలిక ఐఐఎం నిర్వహణకు, శాశ్వత భవనాలు, క్యాంపస్ అభివృద్దికి సమానంగా వెచ్చించాల్సిన అవసరం ఉంది. మొత్తంమీద విశాఖలో రానున్న విద్యా సంవత్సరం నుంచి అనుకున్న విధంగా ఐఐఎం ప్రారంభించడానికి ఈ నిధులు కొంత వరకు ఉపకరించే అంశం. గంభీరంలో శాస్వత క్యాంపస్ ఏర్పాటు వేగవంతం చేయడానికి మాత్రం ఈ నిధులు ఎంతమాత్రం సరిపోవు. విశాఖలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెట్రోరైల్ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయానికి కేంద్రం కదలిక మాత్రమే తెచ్చింది. ఈ బడ్జెట్లో కేటాయించిన 5.3 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టును డిల్లీ మెట్రో కార్పొరేషన్‌కు అందించింది. శ్రీధరన్ తొలి దశలో విశాఖలో గతలో పర్యటించి ప్రాధమికంగా ఒక అవగాహనకువచ్చారు. అందరూ ఆశించిన స్థాయిలో ఈ రెండు ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు ఉంటాయని భావించినప్పటికీ కేంద్రం కరుణ చూపలేదు. వేతన జీవులకు నిరాశే: విశాఖ నగరం పారిశ్రామికంగా ఎంతో ప్రగతి సాధిస్తోంది. నగరంలో అధికశాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు. వీరు ఆదాయపన్ను పరిమితి పెంపుదల జరుగుతుదని ఆశించారు. వీరి ఆశలను నిరాశ పరిచే విధంగా ఈ బడ్జెట్ సాగడంతో ఉద్యోగులంతా తీవ్రంగా నిరాశ చెందారు. వేతన జీవులకు ఎంతమాత్రం ఈ బడ్జెట్ దయ చూపలేదు. పాత శ్లాబులే కొనసాగింపుపై ఈ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. -
సిటీకే ‘మెట్రో’ పరిమితం
ఎట్టకేలకు స్పష్టత తొలి విడత 26 కిలోమీటర్లు బందరు, ఏలూరు రోడ్ల ఎంపిక విస్తృతంగా పర్యటించిన శ్రీధరన్ కమిటీ విజయవాడ సెంట్రల్ : ప్రతిష్టాత్మక మెట్రోరైల్ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చింది. మెట్రో ప్రాజెక్ట్ ముఖ్య సలహాదారు శ్రీధరన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ శనివారం విజయవాడలో విస్తృతంగా పర్యటించింది. తొలి విడతగా నగరంలో 26 కిలో మీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. బందరురోడ్డులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, అక్కడ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ఏలూరు రోడ్డును అనుసంధానం చేస్తూ రామవరప్పాడు రింగ్ వరకు రైల్ లైన్ ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా భావిస్తున్నారు. జన సమ్మర్థం ఆధారంగా ఈ రెండు రోడ్లను శ్రీధరన్ బృందం ఎంపిక చేసింది. బెజవాడకు మీడియం రైలు చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో ఏర్పాటు చేసిన తరహాలో మీడియం మెట్రోను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 45వేల నుంచి 50 వేల మంది ప్రయాణించేందుకు వీలుగా ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. రూ.7,500 కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను ప్రభుత్వం ఆమోదించి, నిధులు విడుదల చేస్తే మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీరనున్న ప్రయాణికుల కష్టాలు మెట్రో రైలు అందుబాటులోకి వస్తే విజయవాడలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రయాణ కష్టాలు తీరే అవకాశం ఉంది. నగర జనాభా ఇప్పటికే 12లక్షలకు చేరింది. రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే స్థాయిలో ట్రాఫిక్ సమస్య కూడా ఉత్పన్నమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో 250 సిటీ బస్సులు, 13 వేలకు పైగా ఆటోలు నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రజలకు ప్రయాణ కష్టాలు తప్పడంలేదు. మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే తక్కువ ఖర్చుతో సమయం వృథా కాకుండా గమ్యస్థానాన్ని చేరుకొనే అవకాశం ఉంటుంది. బస్సులో గంటసేపు వెళ్లే దూరాన్ని మెట్రో రైలులో కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. రైలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సులు, ఆటోల సంఖ్య తగ్గిస్తే నగరంలో కాలుష్యాన్ని కొంత మేర అరికట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
250 కి.మీ. మెట్రో
మెట్రోరైల్ ప్రాజెక్టును మరింత విస్తరిస్తాం: కేటీఆర్ హైదరాబాద్: మెట్రోరైల్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రస్తుతం కొనసాగుతున్న 72 కిలోమీటర్ల మెట్రోరైల్ మార్గాన్ని రానున్న రెండు దశాబ్దాల కాలంలో 250 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ (ఐఎంఆర్‌టీ) ఆధ్వర్యంలో దేశంలోనే ప్రప్రథమంగా ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మెట్రో అండ్ రైల్ టెక్నాలజీ’ (పీజీపీఎంఆర్టీ) కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం అమీర్‌పేట్‌లోని మ్యారీగోల్డ్ హోటల్లో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. నగర చారిత్రక వైభవం చెక్కుచెదరకూడదన్న ఉద్దేశంతోనే చారిత్రక కట్టడాలున్న ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్లో మార్పులు చేయాలని ప్రభుత్వం హెచ్ఎంఆర్ సంస్థకు పలు సూచనలు చేసిన మాట నిజమేనని, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆ సంస్థ ఆలోచిస్తోందన్నారు. దీనిపై నిపుణుల నివేదిక వచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని అధిగమించి మెట్రోరైల్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. మార్చి నాటికి పరుగులు.. 2015, మార్చి 21న ఉగాది పర్వదినం కానుకగా నాగోలు-మెట్టుగూడా మధ్య 8 కి.మీ. మార్గంలో మెట్రోరైల్ పరుగులు తీస్తుందని హెచ్ఎంఆర్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రూట్లో నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నట్లు చెప్పారు. ట్రయల్ రన్‌ను ఆగస్టు నెలాఖరులో నిర్వహించే అవకాశాలున్నాయన్నారు. చారిత్రక భవనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణలోనికి తీసుకున్నట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎదురుగా, సుల్తాన్‌బజార్ వద్ద అలైన్మెంట్లో మార్పులపై దృష్టిసారించాలని సీఎం కేసీఆర్ సూచించారని ఈమేరకు ప్రత్యామ్నాయ మార్గాలను సాంకేతికంగా పరిశీలిస్తున్నామని, ఈ మేరకు ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ సంస్థ నిపుణులు సమగ్రంగా సర్వే జరుపుతున్నారన్నారు. సీఎం నిర్ణయం మేరకే పనులు చేపడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(హెచ్ఎంఆర్ ఎల్)సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తుందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, మెట్రోరైల్ ప్రాజెక్టుపై సర్వాధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నాయని ఎన్వీఎస్రెడ్డి స్పష్టం చేశారు. నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరవాత ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ చురుకుగా పనిచేస్తుం దని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు పనులు,హెచ్ఎంఆర్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిందని వెలువడుతోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దేశంలోనే హైదరాబాద్ మెట్రోరైల్ నిర్మాణం అరుదైన రికార్డు సాధించిందన్నారు. మొత్తం 72 కిలోమీటర్లకు గాను 27 కిలోమీటర్ల మేర పనులను 20 నెలల్లో పూర్తి చేసినట్లు ఎన్వీఎస్రెడ్డి గుర్తుచేశారు. -
ప్రాచీన సంపద పరిరక్షణ పట్టదా ?
చారిత్రక కట్టడాలపై నిర్లక్ష్యం హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ రద్దుతో ఇబ్బంది సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ నగరంలోని చారిత్రక సంపద పరిరక్షణ ఇప్పుడు ఎవరికీ పట్టకుండా పోయింది. ఏడాదిన్నర గడిచినా హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసం 2010 మార్చి 17న నియమించిన‘హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ’ 2013 మార్చి 17 నాటికి కాలపరిమితి ముగియడంతో రద్దయిపోయింది. సుమారు ఏడాదిన్నర గడుస్తున్నా ఇంతవరకు దీనిగురించి పట్టించుకొన్న నాథుడే లేడు. ఇప్పటికే వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన వివిధ భవనాలకు సంబంధించి అతిక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రస్తుతం మెట్రో రైల్ మార్గంలో పలుచోట్ల చారిత్రక వారసత్వ కట్టడాలు అడ్డువస్తుండటంతో వాటి పరిరక్షణ వ్యవహారం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. వీటికి కలిగే నష్టంపై నివేదిక ఇచ్చేందుకు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ లేకపోవడంతో తీవ్ర నష్టం కలగనుంది. ఎలా సాధ్యం? నగరంలో చారిత్రక వారసత్వ కట్టడాలకు నష్టం కలుగనివ్వమని, అవసరమైతే భూగర్భంలో మెట్రో రైల్ మార్గాన్ని నిర్మిస్తామని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ప్రాచీన కట్టడాల పరిరక్షణ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. మెట్రోరైల్ ప్రాజెక్టు సమీక్షా సమావేశం సందర్భంగానైనా అధికారులు హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లలేకపోయారు. నిజానికి 2010 మార్చి 17న తొమ్మిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీని గత ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్.రాజమణిని, సభ్యులుగా కె.రమేష్ (ఇంజనీర్), అన్వర్ అజీజ్ (ఆర్కిటెక్), సంజయ్ తొర్వి (ఆర్కిటెక్)ని నియమించింది. అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డెరైక్టర్‌ను, ఎం.విశ్వనాథన్ (ప్రొఫెసర్ జేఎన్టీయూ), సాజిద్ సాహిద్, ఫరూఖ్ ఖాదర్‌లను సభ్యులుగా, హెచ్ఎండీఏ అర్బన్ ప్లానర్ విభాగం నుంచి ఒకరిని మెంబర్ సెక్రటరీగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం (జీఓ.ఎం.ఎస్.నెం.124, ఎం.ఏ) ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి నిర్దిష్ట కాలపరిమితి ముగిసిపోవడంతో అది రద్దయింది. కనిపించని ఫలకాలు చారిత్రక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన భవనాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫలకాలు కనుమరుగయ్యాయి. గతంలో బీపీ ఆచార్య హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉన్నప్పుడు చారిత్రక వారసత్వ భవనాలకు ప్రత్యేకంగా ఓ ఫలకాన్ని ఏర్పాటు చేసి ఆ భవనం తాలుకు వివరాన్నీ అందులో పొందుపర్చారు. అప్పట్లో బేగంపేట లోని పైగా ప్యాలెస్ (ప్రస్తుత యూఎస్ కన్సోలేట్), గ్రీన్‌ల్యాండ్ గెస్ట్ హౌస్ భవనాలకు ప్రత్యేకంగా ఫలకాలను ఏర్పాటు చేసి వాటి పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆయన బదిలీ కావడంతో ఆ బాధ్యతలను చేపట్టిన అధికారులు ఫలకాల ఏర్పాటుకు తిలోదకాలిచ్చారు. ఫలితంగా ఏది పురాతన భవనమో..? లేక ఏది చారిత్రక వారసత్వ కట్టడమో..? ప్రజలకు తెలియని పరిస్థితి ఎదురైంది. -
మెట్రోరైల్ ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరగాలి
స్టే ఉన్నా ప్రైవేటు ఆస్తుల్లో పనులు కోర్టు ధిక్కారంపై త్వరలో హైకోర్టుకు కంట్రీక్లబ్ చైర్మన్ రాజీవ్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలని కంట్రీక్లబ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వై. రాజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనమే ధ్యేయంగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) వ్యవహరిస్తోందని, ప్రైవేటు ఆస్తుల స్వాధీనంలో పారదర్శకత లేకపోవడంతో దీనిపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లోనే మైట్రో రైల్వేస్టేషన్ నిర్మించాలని మెట్రో రైల్ ప్రాజెక్ట్ నివేదికలో పేర్కొన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి తమ కార్పొరేట్ ఆఫీసును స్వాధీనం చేసుకోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే మెట్రో రైలు కోసం రూ.35 కోట్ల విలువైన 1,700 చదరపు అడుగుల స్థలం ఇచ్చినప్పటికీ, 1,000 మంది సిబ్బంది పనిచేస్తున్న కార్పొరేట్ ఆఫీసును కూడా స్వాధీనం చేసుకుంటోందన్నారు. 2006లో కార్పొరేట్ ఆఫీసు నిర్మించుకోవడానికి అభ్యంతరం లేదంటూ హెచ్ఎంఆర్ఎల్ అనుమతి ఇచ్చిన తర్వాతనే దీన్ని నిర్మించినా ఇప్పుడు నోటీసులు జారీ చేసిందని, దీనిపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా కూల్చివేస్తామంటోందని రాజిరెడ్డి ఆరోపించారు. కోర్టు ధిక్కారంపై త్వరలో హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. -
మళ్లీ ట్రయల్న్
చెన్నై, సాక్షి ప్రతినిధి:మెట్రోరైల్ ప్రయాణపు అనుభవాలను ఆస్వాదించేందుకు నగర ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చడమేగాక నగరానికి మరింత శోభను చేకూర్చే మెట్రోరైలు నిర్మాణ పనులు ముమ్మురంగా సాగుతున్నాయి. 14,500 కోట్ల అంచనాతో ఆరంభించిన మెట్రోరైల్ ప్రాజెక్టును 2015 నాటికి సిద్ధం చేసేలా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అయితే అంతకంటే ముందుగానే అందిస్తామని మెట్రో అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాకలిపేట- మీనంబాకం ఎయిర్‌పోర్టు వరకు 22.1 కిలోమీటర్లు, చెన్నై సెంట్రల్- పరంగిమలై వరకు 22 కిలోమీటర్లతో మొత్తం 45.1 కిలో మీటర్ల పొడవున రెండు మార్గాల్లో నిర్మాణం జరుపుకుంటోంది. చాకలిపేట-సైదాపేట వరకు 11 రైల్వేస్టేషన్లతో సొరంగమార్గం, ఆరు రైల్వే స్టేషన్లతో సైదాపేట-మీనంబాకం వరకు ఆకాశవంతెన మార్గం సిద్ధమవుతోంది. సెంట్రల్- అన్నానగర్ టవర్ వరకు సొరంగమార్గం, తిరుమంగళం నుంచి కోయంబడే, వడపళని, అశోక్‌నగర్, ఈక్కాడు తాంగల్ వరకు ఆకాశవంతెన మార్గంలో రైలు ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో 8 రైల్వే స్టేషన్లు సిద్ధమవుతున్నాయి. తొలి, మలి ట్రయల్ రన్ నాలుగు బోగీలతో కూడిన మెట్రోరైలు బ్రెజిల్ నుంచి ఆరు నెలల క్రితమే చెన్నై చేరుకోగా 800 మీటర్ల ట్రయల్న్‌న్రు గత ఏడాది నవంబరు 6వ తేదీన నిర్వహించారు. రిమోట్ కంట్రోలు ద్వారా సచివాలయం నుంచే అన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కానిచ్చే సీఎం జయలలిత నేరుగా హాజరై ట్రయల్న్‌క్రు జెండా ఊపారు. రైలు బోగీలోకి ఎక్కి వసతులను పరిశీలించారు. 2014వ సంవత్సరంలో కోయంబేడు-పరంగిమలై (సెయింట్ థామస్ మౌంట్) నడుమ ప్రయాణికుల కోసం మెట్రోరైలు పరుగులు పెడుతుందని ట్రయల్న్ నాడే అధికారులు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా ఫిబ్రవరిలో మళ్లీ పాతమార్గంలోనే ట్రయల్న్‌క్రు సిద్ధమవుతున్నారు. అయితే గత ఏడాది కేవలం 800 మీటర్లు మాత్రమే ట్రయల్న్ సాగింది. ఈ సారి 11 కిలోమీటర్ల దూరం వరకు అంటే రెండు ప్రధాన రైల్వే స్టేషన్ల నడుమ ట్రయల్న్ నిర్వహించనున్నారు.