
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషివల్లే హైదరాబాద్ నగరానికి ఈ రోజు మెట్రో రూపుదిద్దుకుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఈ విషయంలో తన పోరాటం వల్లే హైదరాబాద్‌కు మెట్రోరైల్ ప్రాజెక్టు వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఏ మంచి జరిగినా తానే చేశానని, చెడు జరిగితే ప్రతిపక్షాలకు ఆపాదించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. మెట్రోరైల్ ప్రాజెక్టును ప్రతిపాదించి దానికి చెందిన పనులను ప్రారంభించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు. దీనికోసం వైఎస్ ఎంతో కృషి చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment