హైదరాబాద్ : నగరంలోని పుప్పాలగూడ వద్ద మంజీరా నీటి ట్రయల్ రన్‌లో అపశృతి చోటుచేసుకుంది. గేట్‌వాల్ కప్పుపై నిల్చుని వాల్ తిప్పుతుండగా శ్లాబ్ విరిగి మీద పడటంతో పంచాయితీ పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న మల్లేష్ అనే వ్యక్తితోపాటు మరో ముగ్గురు కిందపడ్డారు. శ్లాబ్ మల్లేష్ నడుముపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో మల్లేష్‌ను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.