త్వరలో నంద్యాల- ఎర్రగుంట్ల మార్గంలో రైళ్ల రాకపోకలు | nandyal yerraguntla railway line | Sakshi
Sakshi News home page

త్వరలో నంద్యాల- ఎర్రగుంట్ల మార్గంలో రైళ్ల రాకపోకలు

Published Fri, Aug 14 2015 3:11 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

nandyal yerraguntla railway line

సంజామల: నంద్యాల- ఎర్రగుంట్ల మార్గంలో త్వరలో రైళ్ల రాకపోక లు కొనసాగనున్నట్లు రైల్వేశాఖ గుంతకల్లు  డీఆర్‌ఎం గోపీనాథ్ మాల్య చెప్పారు. గురువారం ఈ మార్గంలో మండలంలోని నొస్సం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నొస్సం రైల్వేస్టేషన్‌లో స్టేషన్, ఫ్లైఓవర్, క్వార్టర్స్, తదితర వాటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మార్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరిగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె రైల్వేస్టేషన్ల నిర్మాణ పనులు, క్రాసింగ్స్, సిగ్నల్స్, ఫ్లాట్‌ఫాం, తదితర పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఈ పనులను వీలైనంత త్వరలో పూర్తి చేసి బనగానపల్లెవరకు ప్యాసింజర్ రైలును నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో మారు ట్రయల్న్ ్రనిర్వహించి వచ్చే ఏడాది మార్చికంతా రైళ్ల రాకపోకలు జరిగేలా పనులను వేగవంతం చేశామన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో పెండింగ్ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పనులు చురుగ్గాసాగుతున్నాయని పేర్కొన్నారు.  కార్యక్రమంలో సీనియర్ ఈఓ మనోజ్‌కుమార్, స్థానిక నేతలు మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గాధంశెట్టి వెంకటేశ్వర్లు, శంకర్, వాసుదేవరెడ్డి,పాల్గొన్నారు.  
 
  సంజామల రైల్వేస్టేషన్‌కు
 పెండేకంటి పేరు పెట్టండి:
  సంజామల రైల్వేస్టేషన్‌కు, ప్యాసింజర్ రైలుకు  బీహార్, కర్నాటక రాష్ట్రాల గవర్నర్, కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రి దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య పేరు పెట్టాలని ఆయన వంశస్తుడైన పెండేకంటి కిరణ్‌కుమార్ కోరారు. గురువారం రైల్వే పనులను పరిశీలించేందుకు వచ్చిన డీఆర్‌ఎం గోపీనాథ్ మాల్యాను కలిసి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement