
గేట్‌లో నగేష్ భట్‌కు 132వ ర్యాంక్
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని రోటరీపురంలోని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ విభాగానికి చెందిన నగేష్ భట్ అనే విద్యార్థి 132వ ర్యాంక్ సాధించినట్లు కళాశాల సీఈఓ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. గేట్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఓఎన్‌జీసీ, బీహెచ్‌ఈఎల్, ఎన్టీపీసీ వంటి గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగావకాశం ఉంటుందన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి రూ. 5 వేల బహుమతి అందజేసి, అభినందించారు. ఆల్ ఇండియా స్థాయిలో విద్యార్థి మంచి ర్యాంక్ సా«ధించడం తమ కళాశాలకు గర్వకారణమని సాంబశివారెడ్డి తెలిపారు.