డ్యాంపైకి క్రేన్లు, గేట్ విడిభాగాలు
డ్యాంలో 40 టీఎంసీలు ఖాళీ
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో హొసపేటె వద్ద తుంగభద్ర జలాశయంలో 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికి 40 టీఎంసీలకు పైగా నీటిని వదిలేశారు. మూడు రోజుల నుంచి క్రస్ట్ గేట్ ఏర్పాటుకు డ్యాం అధికారులు, నిపుణులు తీవ్రంగా యత్నిస్తున్నారు. గురువారం ఉదయం జిందాల్ కంపెనీ తయారు చేసిన స్టాఫ్‌లాగ్ గేట్‌లోని హెలిమెట్స్‌ను తుంగభద్ర డ్యామ్ వద్దకు తీసుకొచ్చారు.
డ్యామ్‌పైన భారీ క్రేన్ల సహాయంతో 80 మంది కార్మికులతో గేట్‌ను దింపే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రత్యేక నిపుణుడు కన్నయ్యనాయుడు సూచనలతో స్టాఫ్‌లాగ్ గేట్లను ఏడు సిద్ధం చేశారు. ఒక్కో పీసు 15 టన్నుల బరువుతో తయారు చేస్తున్న వాటిని ఒక్కొక్కటిగా డ్యామ్ వద్దకు చేర్చి క్రస్ట్ గేట్ స్థానంలోకి భారీ క్రేన్ల సహాయంతో దింపుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా తక్షణం అన్ని విధాలా రక్షించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. రేపటిలోపు పనులు పూర్తి చేసే అవకాశాలున్నాయని బోర్టు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment