నేటి నుంచే ‘గేట్’ | GATE to be conducted from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచే ‘గేట్’

Published Sun, Feb 2 2014 3:01 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

GATE to be conducted from today

 సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో ఎంటెక్ తదితర పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికిగాను గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2014) ఆదివారం నుంచి నిర్వహించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2, 15, 16, మార్చి 1, 2 తేదీల్లో ఆన్‌లైన్‌లో 22 పేపర్లలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటాయని వెల్లడించింది. గతేడాది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈసారీ అదే స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష ఫలితాలను మార్చి 28న విడుదల కానున్నాయి.

 రాష్ట్రంలో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలివీ: బాపట్ల, చిత్తూరు, దిండిగల్, గూడూరు, గుంటూరు, కడప, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, వరంగల్, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement