Mtech
-
ఇంజనీరింగ్ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు
సాక్షి, హైదరాబాద్: బీటెక్ పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది విదేశీ విద్య వైపే మొగ్గుచూపుతున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఎంపికైనా సరే... ఎంఎస్ చేసిన తర్వాతే ఏదైనా అంటున్నారు. ఎంటెక్ వంటి పీజీ కోర్సుల్లో చేరేందుకు తక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. గత ఐదేళ్లుగా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. ఎంటెక్ కోర్సుల్లో సీట్లు నిండే పరిస్థితి కూడా లేదు. ఏటా 70–65 వేల మంది బీటెక్ ప్రవేశాలు పొందుతుంటే, కనీసం 4 వేల మంది కూడా ఎంటెక్‌లో చేరడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదీ కూడా గేట్ ద్వారా ఐఐటీ, ఎన్ఐటీల్లో చేరే వారే 3 వేల మంది వరకూ ఉన్నారు. దాదాపు 12 వేల మంది ప్రతి ఏటా ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. మేనేజ్మెంట్, ఇతర పీజీ కోర్సులకు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్లే వారి సంఖ్య 15 వేల వరకూ ఉంటోంది. ఇలా మొత్తం మీద 27 వేల మందికిపైగా బీటెక్ తర్వాత ఇతర దేశాలకు పయనమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో బీటెక్‌కు ఉన్న పోటీ వాతావరణం ఇతర కోర్సులకు ఉండటం లేదు. అవకాశాలే లక్ష్యం... విదేశాల్లో సాధారణంగా ఎంఎస్ తర్వాత సాఫ్ట్వేర్ సంస్థల్లో నియామకాలు చేపడతారు. మన దేశంలో మాత్రం బీటెక్ తర్వాతే ఈ అవకాశాలు ఉంటున్నాయి. అయితే, మన దేశంతో పోలిస్తే విదేశాల్లో ఎంఎస్ చేసిన తర్వాత మంచి వేతనం లభిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. ఎంఎస్ చేసేందుకు బ్యాంకులు ఎక్కువగా రుణాలివ్వడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో అనధికారికంగా ఏదో ఒక పార్ట్‌టైమ్ ఉపాధి పొందేందుకు అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, కొంతకాలంగా ఇంజనీరింగ్ విద్యలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కంప్యూటర్ కోర్సుల్లో ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్ ఉన్న కోర్సులొచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి కోర్సులు ఇక్కడ చేసి, కొనసాగింపుగా అమెరికాలో ఎంఎస్ చేయడం ప్రయోజనంగా ఉంటోందని సాఫ్ట్వేర్ నిపుణులు అంటున్నారు. ఈ కారణంగా బీటెక్ తర్వాత ఎంఎస్కే ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ముందంజలో ఉన్నాయి. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికతో విద్యను అందిస్తున్నాయి. అందుకే విదేశీ మేనేజ్మెంట్ కోర్సులకూ ప్రాధాన్యమిస్తున్నారు. -
తమ్ముడికి కాల్ చేసి బైక్ తీసుకెళ్లమని చెప్పి.. యువకుడు ఆత్మహత్య
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): ఎంటెక్‌లో సీటు రాలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌కు చెందిన ఎండీ షఫీ(26) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎంటెక్ కోసం ఇటీవల ఎంట్రెన్స్ రాయగా సీటు రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఎంటెక్ చేయకపోతే మంచి ఉద్యోగం రాదని నిరాశకు లోనయ్యాడు. బుధవారం ఉదయం ఇంట్లో బయటికి వెళ్తున్నానని చెప్పి అలుగునూరు శివారులోని కాకతీయ కాలువ వద్దకు వెళ్లాడు. చదవండి: కన్న తండ్రిపై అమానుషం.. పీకల దాక మద్యం తాగి.. ఆపై నూనె చల్లి.. అక్కడ తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి వేసి తన తమ్ముడికి కాకతీయ కెనాల్ వద్ద బైక్ ఉంది తీసుకెళ్లాలని మెసేజ్ చేశాడు. ఆ వెంటనే ఫోన్ స్విచాఫ్ చేశాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కెనాల్ వెంట వెతుకుతుండగా బైక్ కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కెనాల్లో గాలించగా మృతదేహం బయటపడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: నటి షాలూ చౌరాసియాపై దాడి: అస్పష్టంగా నిందితుడి ఆనవాలు.. -
ఎంటెక్: పాత కోర్సులకు కత్తెర.. 7 కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్తగా పలు ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. గతేడాది కొత్త కోర్సుల్లో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నిం గ్, డేటా సైన్స్ వంటి ప్రధాన సబ్జెక్టులతోనే కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా, ఈసారి వాటి సంఖ్య పెంచి 7 రకాల కొత్తకోర్సులు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సె క్యూరిటీ.. సివిల్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్.. ఈసీఈలో ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ వీఎల్ఎస్ఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మైక్రో ఎల్రక్టానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైన్.. మెకా నికల్లో మెకట్రానిక్స్ పీజీ కోర్సులు ఉన్నాయి. కొన్ని కాంబినేషన్లకు కత్తెర! గతేడాది బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో (సీఎస్ఈ) సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సీఎస్ఈ నెట్వర్క్స్ కోర్సులకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు జారీ చేసింది. అయితే ఈసారి (2021–22లో) బీటెక్ సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, మెకానికల్‌లో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌కు అనుబంధ గుర్తిం పు ఇస్తామని ప్రకటించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌ను ప్రత్యేక కోర్సులుగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కోర్సులకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చని జేఎనీ్టయూ వెల్లడించింది. అయితే గతేడాది బీటెక్‌లో ఇచి్చన సీఎస్ఈ నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తారా, లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. పాత వివరాలతోనే.. రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు నిర్వహించే ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ)’తనిఖీలు ఈసారి నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో తనిఖీలు చేయలేదు. ప్రస్తుతం కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రెండేళ్ల కిందటి తనిఖీలు, గతేడాది కాలేజీలు అందజేసిన డాక్యుమెంట్ల పరిశీలన, తాజాగా అందజేసే అఫిడవిట్ల ఆధారంగానే అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. మే మొదటి లేదా రెండో వారంలో ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)’నుంచి కాలేజీలకు, కోర్సులకు అనుమతులు లభించనున్నాయి. ఆ వెంటనే రాష్ట్ర యూనివర్సిటీలు ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నాయి. మరోవైపు ఈసారి ఇంకో 12 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. చదవండి: ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్‌లో సాధ్యమేనా?! -
ఏపీ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ : ఏపీ పీజీ ఈసెట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు విడుదల చేశారు. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 24,248మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫలితాల్లో 20,986 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ నెల 20 నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విజయరాజు తెలిపారు. 12 ఇంజినీరింగ్ పీజీ కోర్సులు, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలో వివిద కాలేజీలలో ఉన్న 21,941 ఎంటెక్, 5495 ఎంఫార్మసీ సీట్లను మెరిట్ ప్రకారం కేటాయించనున్నారు. సబ్జెక్టుల వారిగా మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు బయోటెక్ - పి.షామారజిత, ఈస్ట్ గోదావరి కెమికల్ ఇంజనీరింగ్ - ఏ వేదశ్రీ, నెల్లూరు జిల్లా సివిల్ ఇంజనీరింగ్ - మహంతి అంజనీబాయ్, గుంటూరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ - కెహెచ్ఎన్ సీతారాగిని, గుంటూరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ - ఎం.జ్యోష్న, కడప ఎలక్ట్రానిక్ అండ్ కమ్యునికేషన్ ఇంజనీరింగ్ - టి.మహేంద్ర, ప్రకాశం ఫుడ్ టెక్నాలజీ - పి.రవళి, వెస్ట్ గోదావరి జియో ఇంజనీరింగ్ - ఎ.రవితేజ, కృష్ణా ఇనుస్టుమెంటేషన్ ఇంజనీరింగ్ - ఎస్ఎన్.సింధూరీ, కృష్ణా మెకానికల్ ఇంజనీరింగ్ - ఎ.సాయిచరణ్, కర్నూలు మెటాలజికల్ ఇంజనీరింగ్ - ఎ.సాయిప్రకాష్, వెస్ట్ గోదావరి నానో టెక్నాలజీ - పి.మంత్రునాయక్, ప్రకాశం ఫార్మసీ - పి.పృధ్వీ, కృష్ణా -
ఎంటెక్‌లో తగ్గిన ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంటెక్‌లో చేరిన విద్యార్థుల సంఖ్య ఈసారి తగ్గిపోయింది. గతేడాది తో పోలిస్తే ఈసారి విద్యార్థుల సంఖ్య 400కు పైగా తగ్గిపోయింది. గతేడాది రాష్ట్రంలోని 168 కాలేజీల్లో 8,374 సీట్లు ఉంటే 7,523 మంది కాలేజీల్లో చేరారు. ఈసారి 242 కాలేజీల్లో 8,967 సీట్లు ఉండగా 7,185 మంది మాత్రమే చేరారు. గతేడాది కాలేజీలు, సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ కాలేజీల్లో చేరినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎంటెక్ లో గతేడాది 851 సీట్లు మాత్రమే మిగిలిపోగా.. ఈసారి 1,782 సీట్లు మిగిలాయి. సగానికి పైగా తగ్గిన సీట్లు..: నాలుగేళ్లలో ఎంటెక్‌లో సీట్ల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది. 2015 విద్యా సంవత్సరంలో 21,750 సీట్లు అందుబాటులో ఉండగా ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు, యాజమాన్యాలే స్వయంగా సీట్లను తగ్గించుకోవడం వల్ల ప్రస్తుతం వాటి సంఖ్య 8,967కు చేరింది. -
ఐఐటీల్లో పీజీ.. ఉద్యోగం ఈజీ!
సాక్షి, హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ఇంజనీరింగ్, మేథమెటిక్స్, హ్యుమానిటీస్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది ఉద్యోగాల పంట పండింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ విద్యార్థులకు కంపెనీలు భారీగా వేతనాలు ఆఫర్ చేశాయి. ఐఐటీల్లో చదివే బీటెక్ విద్యార్థులతో పోలిస్తే.. పీజీ (ఎంటెక్) విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగావకాశాల శాతం (60–65 శాతం మాత్రమే) తక్కువ. కానీ ఈ ఏడాది కాన్పూర్, రూర్కీ, భువనేశ్వర్, ఖరగ్‌పూర్, హైదరాబాద్, గాంధీనగర్ ఐఐటీల్లో పీజీ చదువుతున్న వారిలో 90 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ ఐఐటీలోనైతే ప్లేస్‌మెంట్‌కు నమోదు చేసుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావడం గమనార్హం. అంతేకాదు కంపెనీలు గతేడాదితో పోలిస్తే 50 శాతం మేర ఎక్కువగా వేతనాలు ఆఫర్ చేశాయి. గతేడాదికన్నా ఎక్కువగా... ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీ చేస్తున్న విద్యార్థుల్లో 570 మందికి ఆయా కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. గతేడాది ఉద్యోగాలు పొందిన 342 మందితో పోలిస్తే ఇది 40 శాతం అధికం. ఐఐటీ కాన్పూర్‌లో గత సంవత్సరం 301 మందికి ఉద్యోగాలివ్వగా.. ఈసారి 30 శాతం ఎక్కువగా 432 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇక గత మూడేళ్లలో ఢిల్లీ, చెన్నై ఐఐటీల్లో పీజీ విద్యార్థుల ప్లేస్మెంట్లు 60–75 శాతానికి మించలేదు. కానీ ఈ ఏడాది ఏకంగా 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. అంతేకాదు కాన్పూర్, చెన్నై, రూర్కీ ఐఐటీల్లో ఈసారి ఉద్యోగాలు పొందిన పీజీ విద్యార్థులకు గత ఐదేళ్ల సగటుతో పోల్చితే 90 శాతం అధికంగా వేతన ఆఫర్లు వచ్చాయి. పీజీ విద్యార్థులకు పెరుగుతున్న డిమాండ్ బీటెక్ చదివినవారు కంపెనీల్లో స్థిరంగా ఉద్యోగాలు చేయకపోవడం, ఏడాది రెండేళ్లు పనిచేశాక పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెన్నై ఐఐటీ ప్లేస్మెంట్ విభాగం ఓ విశ్లేషణలో వెల్లడించింది. అందువల్ల రెండు మూడేళ్లుగా పీజీ విద్యార్థులకు ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది. కంప్యూటర్ సైన్స్ వారికి భారీ వేతనాలు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రధానాంశంగా, మెకానికల్‌లో రోబోటిక్స్ ప్రధానాంశంగా పీజీ చేస్తున్నవారికి డిమాండ్ ఎక్కువగా ఉంది. వారికి కనిష్టంగా రూ. 75 లక్షల నుంచి గరిష్టంగా రూ. 90 లక్షల వరకు వార్షిక వేతనాల ఆఫర్లు రావడం గమనార్హం. అంతేకాదు ఈసారి పీజీ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు గత ఐదేళ్ల సగటుతో పోల్చితే కనిష్టంగా 50 శాతం నుంచి గరిష్టంగా 90 శాతం వరకు అధికంగా వేతనాల ఆఫర్లు వచ్చాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు మాత్రమే కాదు డ్యూయల్ డిగ్రీ (ఐదేళ్ల మాస్టర్ డిగ్రీ) చేసిన విద్యార్థులకు కూడా ప్రతిష్టాత్మక కంపెనీలు మంచి ఆఫర్లు ఇచ్చాయి. ఎక్కువ వేతనం ఆఫర్ చేసిన కంపెనీల్లో సామ్సంగ్ ఆర్అండ్డీ, ఇంటెల్, టాటా మోటార్స్, గోల్డ్‌మన్‌శాక్స్, హ్యూందాయ్, మైక్రోసాఫ్ట్, హెచ్‌పీ వంటి కంపెనీలు ఉన్నాయి. ఎన్ఐటీల్లోనూ ‘పీజీ’డిమాండ్ ఐఐటీలే కాదు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లలో కూడా పీజీ విద్యార్థులకు ఈసారి భారీగా ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని నాస్కామ్ తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ‘‘పీజీ విద్యార్థులు ప్రత్యేకమైన కోర్సులో స్పెషలైజేషన్ పూర్తి చేస్తారు. ఎంపిక చేసుకున్న సబ్జెక్టు మీద వారికి పూర్తిగా అవగాహన ఉంటుంది. దీంతో కంపెనీలు పీజీ విద్యార్థుల మీద దృష్టి పెట్టాయి..’’అని నాస్కామ్ సీనియర్ డైరెక్టర్ పి.అశోక్ చెప్పారు. ఓ మోస్తరు పేరున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా పీజీ విద్యార్థులకు కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలోని టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో పీజీ విద్యార్థులకు ప్లేస్మెంట్లు చేపడుతున్నట్లు పలు కంపెనీలు ఇప్పటికే లేఖలు రాశాయి. ఇతర కాలేజీల్లో బీటెక్ చేసినా ఐఐటీల్లో ఎంటెక్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బ్యాచిలర్ అఫ్ టెక్నాలజీ (బీటెక్) సీటు కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీపడతారు. కానీ పది వేల మందికి మాత్రమే సీట్లు లభిస్తాయి. అదే విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌కు మాత్రం పోటీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఐఐటీల్లో బీటెక్ పూర్తికాగానే క్యాంపస్ ప్లేస్మెంట్లలో మంచి ఉద్యోగావకాశాలు వస్తుంటాయి. మరికొందరు పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతోంది. దీంతో ఇతర కాలేజీల్లో బీటెక్ పూర్తి చేసినవారు ఐఐటీల్లో ఎంటెక్ చేసేందుకు అవకాశం లభిస్తోంది. అలాంటివారు ‘గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)’పరీక్ష ద్వారా ఐఐటీల్లో పీజీ కోర్సులు చేయవచ్చు. -
ఎం‘టెక్కే’
- కళాశాలలకు ఆదాయ వనరుగా ఎంటెక్ కోర్సు - ప్రమాణాలు శూన్యం –అధ్యాపకులు, వారి సర్టిఫికెట్లు బోగస్సే –బయోమెట్రిక్‌లోనూ మాయాజాలం –తరగతులు లేకుండా పరీక్షలు జేఎన్టీయూ : ఇంజినీరింగ్ విద్య ప్రమాణాలు రోజురోజుకూ తీసికట్టుగా మారిపోతున్నాయి. జేఎన్టీయూ అధికారులు ప్రతి ఏటా ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (నిజనిర్ధారణ) కళాశాల మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది, ల్యాబోరేటరీ, గ్రంథాలయం వంటి అంశాలను పరిశీలించి నివేదికను అందిస్తుంది. తనిఖీల సమయంలో మాత్రం మొబైల్ ప్యాకింగ్ చేస్తున్న కళాశాలలు అనంతరం సౌకర్యాలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. స్వీయ ప్రకటిత పత్రాల్లో కళాశాలల యాజమాన్యాలు అన్ని సౌకర్యాలు ఉన్నట్లు ప్రకటిస్తున్నా, ఏఐసీటీఈ తనిఖీల్లో, వర్సిటీ ఆకస్మిక కమిటీ తనిఖీలల్లోను లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. దాగుడు మూతలు .. ఒక కళాశాలలో ఉన్న వారినే మరో కళాశాల అధ్యాపకులుగా చూపించడం, అర్హతలు లేకున్నా బోధన సిబ్బందిని నియమించడం, కొంతమంది అర్హతలతో రికార్డులు సృష్టించుకొన్నా వారి సర్టిఫికెట్ బోగస్ అని నిర్ధారణలో తేలుతోంది. చాలా కళాశాలల్లో అర్హత ధ్రువపత్రాలు చూస్తే అటువంటి వర్సిటీలు దేశ, విదేశాల్లో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏఐసీటీఈ, యూనివర్సిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా కాలేజీ యాజమాన్యాలు పాటించడం తప్పనిసరి అయినప్పటికీ పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. యథేచ్ఛగా అక్రమాలు : బీటెక్‌ను అందించే కళాశాలలకు ఎంటెక్ కోర్సు ఆదాయ వనరుగా మారింది. బీటెక్‌లలో సీట్లు అరకొరగా భర్తీ అవుతున్నప్పటికీ , ఎంటెక్‌లో మాత్రం సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అవుతుండడం గమనార్హం. ఒక్క జేఎన్టీయూ అనంతçపురం పరిధిలో 4 వేల మంది విద్యార్థులు ఎంటెక్‌ను అభ్యసిస్తున్నారు. సింహభాగం కళాశాలల్లో అడుగు పెట్టకుండానే ఎంటెక్ పట్టా ఒట్టిగా అందుకొంటున్నారు. ఇందుకు కళాశాల యాజమాన్యాల సహకారం పుష్కలంగా ఉంది. ఎంటెక్ కోర్సులలో అక్రమాలు అడ్డుకట్ట వేయాలని జేఎన్టీయూ బయోమెట్రిక్ విధానాన్ని ప్రతి ఎంటెక్ కోర్సులకు పాటించాలని ఆదేశించింది. విద్యార్థుల హాజరు కచ్చితంగా గుర్తించాలని అధికారులు భావించారు. ఇందులోనూ విద్యార్థులను పరీక్షలకు డిటైన్ చేయకుండా ఎంత అవసరమో అంత హాజరు శాతాన్ని చూపిస్తున్నారు. గ్రేడింగ్ యోచన.. ఎంటెక్ తరగతుల నిర్వహణ, విద్యా పటిష్టత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడింగ్‌ను ఇవ్వనున్నారు. తరగతులు నిర్వహించని కళాశాలలకు ఫీజు రీయిబర్స్‌మెంట్ రుసుమును అందించకుండా చర్యలు తీసుకోవాలనే నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలిసింది. ఏటా ప్రతి కళాశాలకు ఎంటెక్ ఫీజు కింద రూ. కోటి అందుతోంది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే నిర్ణయాలు అమలు చేయనున్నట్లు తెలిసింది. ఆధార్ అనుసంధానంతో.. అధ్యాపకులు పనిచేసే కళాశాల వివరాలు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నాం. బీటెక్, ఎంటెక్ లకు బయోమెట్రిక్ విధానం అనుసరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) అనుమతి పొందాలంటే ప్రతి కళాశాలలోని బోధన సిబ్బందిలో 50 శాతం ర్యాటిఫికేషన్ (వర్సిటీ గుర్తింపు) ఉండాలి. వర్సిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని కళాశాలలపై చర్యలు తీసుకొంటాం. –ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి , అకడమిక్ అండ్ ఆడిట్ డైరెక్టర్, జేఎన్టీయూ అనంతపురం. -
జాదూగాడురా..
పెళ్లిళ్లు చేయిస్తానని చెప్పి మోసానికి పాల్పడిన యువకుడు అరెస్టు యువతను మోసగిస్తున్న ఎంటెక్ పట్టభద్రుడు వివాహాలు చేయిస్తానని రూ.లక్షల్లో వసూలు నిందితుడి అరెస్టు, రూ.12 లక్షల సొత్తు స్వాధీనం కాకినాడ క్రైం : అతను ఇంజినీరింగ్‌లో పీజీ పూర్తిచేశాడు. పలు ఉద్యోగాలకు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. ఇంటివద్దే ఉంటూ యువత ఆదాయం సంపాదించుకోవచ్చంటూ పేపర్లలో ప్రకటనలు ఇచ్చి పలువురిని మోసగించి, చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కాకినాడ రెండో పట్టణ పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. అతడి వద్ద నుంచి పోలీసులు రూ.12 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. మోసగించే విధానం ఇదీ.. తొండంగి మండలం, వేమవరానికి చెందిన మారేటి శ్రీనివాసరావు (24) అలియాస్ (ఈశ్వర్, రామిరెడ్డి) హైదరాబాద్‌లో ఎంటెక్ చేశాడు. సులువుగా అడ్డదారిన డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఇందుకు పెళ్లికాని ఆశావహులు, యువతను ఎంచుకున్నాడు. వివాహ పరిణయ వేదిక మ్యారేజ్ బ్యూరోను 2014లో ఈశ్వర్ పి. వెంకటరామిరెడ్డి అనే పేరుతో ప్రారంభించాడు. భర్తలేని భార్యకు రెండో పెళ్లి అని... పీటలమీద పెళ్లి ఆగిపోయిందని ఎక్కువ మొత్తంలో కట్నం ఇస్తామని... కులమతాలతో ప్రసక్తి లేదంటూ ఇలా రకరకాల ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి, అందమైన యువతుల ఫొటోలను చూపించి యువకులను ఆకర్షించేవాడు. శ్రీనివాసరావు మాయలో పడిన యువకుల నుంచి ప్రాసెసింగ్ ఖర్చుల కోసమంటూ రూ.10 వేల వరకూ వసూలు చేసేవాడు. టెలికాలర్ ఉద్యోగం పేరిట నెలకు రూ.12 వేల వరకూ ఆదాయం గడించవచ్చంటూ ప్రకటన లిచ్చి నిరుద్యోగ యువత నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. బాధితుల నుంచి ఆధార్, ఏటీఎం కార్డులతో పాటు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకునేవాడు. ఇలా తీసుకున్న ప్రూఫ్స్‌తో వారి పేరుతో íసిమ్ కార్డులు తీసుకునేవాడు. వివాహాల కోసం, టెలికాలర్ ఉద్యోగం కోసం కట్టిన డబ్బులను తన ఖాతాలో డిపాజిట్ చేసుకోకుండా తన సంస్థలో టెలి కాలర్ ఉద్యోగం చేస్తున్న కొంతమంది ఖాతాల్లో వారికి తెలియకుండా డిపాజిట్ చేయించేవాడు. ఏటీఎం కార్డులతో వారికి తెలియకుండానే డబ్బులు డ్రా చేసేవాడు. ఒక్కో యువకుడితో ఒక నకిలీ సిమ్ కార్డుతో సంభాషణ సాగించి, పనిపూర్తయ్యాక ఆ సిమ్ తొలగించేవాడు. ఇలా ఇతను గుంటూరు నుంచి కృష్ణా, విజయవాడ, విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల నుంచే కాక తమిళనాడులోని కొంతమంది బాధితులను మోసగించినట్టు పోలీసుల తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కాకినాడ రెండో పట్టణ పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు అనేక మార్గాల్లో అన్వేషించారు. బ్యాంకు ఖాతాల లావాదేవీలు, సీసీ పుటేజీ వివరాలు, డబ్బు చెల్లించిన ఖాతాలను పరిశీలించగా పోలీసులు ఆధారాలు దొరికాయి. ఎట్టకేలకు కాకినాడ జగన్నాథపురం ఆంధ్రా బ్యాంకులో ఓ మహిళ ఖాతాకు రూ.4.50 లక్షల డిపాజిట్ అయినట్టు గుర్తించి, విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడిందని డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరించారు. నిందితుడ్ని అతడి స్వగ్రామం వేమవరంలో పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి ఎస్టీమ్ కారు, స్కూటర్, 9 బంగారు ఉంగరాలు, 2 బంగారు చైన్లు, 50 నకిలీ సిమ్‌కార్డులు, 10 సెల్ఫోన్లు, 15 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సమావేశంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై వంశీధర్ పాల్గొన్నారు. -
ఎంటెక్ స్పాన్సర్డ్ సీట్లకు దరఖాస్తు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలోని ఎంటెక్ స్పాన్సర్డ్ విభాగంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఓ.అనీల్‌కుమార్ తెలిపారు. దరఖాస్తువిధానం, ఫీజు వివరాలు,అర్హత, సీట్ల సంఖ్య తదితర వివరాలను ఏయూ వెబ్సైట్ నుంచి పొందవచ్చును. ఆగష్టు 4వ తేదీలోగా పూర్తిచేసిన దరఖాస్తులను అందజేయాలి. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ విద్యార్హతలు, అనుభవాలను తెలియజేసే ధ్రువపత్రాలను తీసుకురావాలి. కౌన్సెలింగ్ ఫీజుగా రూ 1000, ఎస్సీ,ఎస్టీలు రూ 500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశం పొందినవారు వెంటనే సంబంధిత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆగష్టు 7వ తేదీన ఉదయం 9 గంటలకు కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, జియో ఇంజనీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులకు మద్యాహ్నం 2 గంటలకు కంప్యూటర్‌సైన్స్, సిస్టమ్స్ ఇంజినీరింగ్, ఈసిఈ, ఇనుస్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెటలర్జీ కోర్సులకు ప్రవేశాలు జరుపుతారు. ప్రవేశాలు ఏయూ ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో మాత్రమే జరుగుతాయి. -
‘పీజీ ఈసెట్’లో మహిళలదే పైచేయి
* మహిళల ఉత్తీర్ణత 92.27%, పురుషుల ఉత్తీర్ణత 89.19% * పీజీ ఈసెట్ సీట్ల సంఖ్య పెంచుతాం: మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష పీజీ ఈసెట్-2014 ఫలితాల్లో మహిళా అభ్యర్థులు 92.27 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. పురుష అభ్యర్థులు 89.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. పీజీ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తెలంగాణ విద్యా శాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి, సీమాంధ్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు స్థానిక ఉస్మానియా దూరవిద్యా కేంద్రంలో సోమవారం సంయుక్తంగా విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొత్తం 1,08,112 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, వీరిలో 97,640 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకుపైగా ఖాళీగా ఉన్న ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ సీట్లను భర్తీ చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఠీఠీఠీ. ్చఞఞజ్ఛఛ్ఛ్టి.ౌటజ, ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పీజీ ఈసెట్‌కు డిమాండ్ పెరిగిందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. పీజీ-ఈసెట్ సీట్లను పెంచి లోటు భర్తీ చేస్తామని అన్నారు. సీమాంధ్రలో విద్యాప్రమాణాలు మెరుగు పరచడంతో పాటు, ఉన్నత విద్యలో తమ ప్రాంతాన్ని ఓ రోల్ మోడల్‌గా మారుస్తానని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ ప్రకాష్, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రతాప్‌రెడ్డి, పీజీ ఈసెట్ కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై 14 నుంచి కౌన్సెలింగ్: రెండు రాష్ట్రాలకు కలిపి జూలై 14 నుంచి పీజీ ఈసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఆన్లైన్ వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నారు. గేట్, జీప్యాట్ అర్హతగల అభ్యర్థులకు తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. రాష్ట్రాలు విడిపోయినా కౌన్సెలింగ్‌లో గత ఏడాది నిబంధనలనే పాటించనున్నట్టు పేర్కొన్నారు. -
నేటి నుంచే ‘గేట్’
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో ఎంటెక్ తదితర పీజీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికిగాను గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2014) ఆదివారం నుంచి నిర్వహించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్ ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 2, 15, 16, మార్చి 1, 2 తేదీల్లో ఆన్లైన్లో 22 పేపర్లలో ఈ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఉంటాయని వెల్లడించింది. గతేడాది ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈసారీ అదే స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష ఫలితాలను మార్చి 28న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలివీ: బాపట్ల, చిత్తూరు, దిండిగల్, గూడూరు, గుంటూరు, కడప, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, వరంగల్, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, భీమవరం, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం.