* మహిళల ఉత్తీర్ణత 92.27%, పురుషుల ఉత్తీర్ణత 89.19%
* పీజీ ఈసెట్ సీట్ల సంఖ్య పెంచుతాం: మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష పీజీ ఈసెట్-2014 ఫలితాల్లో మహిళా అభ్యర్థులు 92.27 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. పురుష అభ్యర్థులు 89.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. పీజీ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తెలంగాణ విద్యా శాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి, సీమాంధ్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు స్థానిక ఉస్మానియా దూరవిద్యా కేంద్రంలో సోమవారం సంయుక్తంగా విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొత్తం 1,08,112 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, వీరిలో 97,640 మంది ఉత్తీర్ణులయ్యారు.
వీరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకుపైగా ఖాళీగా ఉన్న ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ సీట్లను భర్తీ చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఠీఠీఠీ. ్చఞఞజ్ఛఛ్ఛ్టి.ౌటజ, ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ వెబ్‌సైట్ల నుంచి తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పీజీ ఈసెట్‌కు డిమాండ్ పెరిగిందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. పీజీ-ఈసెట్ సీట్లను పెంచి లోటు భర్తీ చేస్తామని అన్నారు. సీమాంధ్రలో విద్యాప్రమాణాలు మెరుగు పరచడంతో పాటు, ఉన్నత విద్యలో తమ ప్రాంతాన్ని ఓ రోల్ మోడల్‌గా మారుస్తానని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ ప్రకాష్, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రతాప్‌రెడ్డి, పీజీ ఈసెట్ కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జూలై 14 నుంచి కౌన్సెలింగ్: రెండు రాష్ట్రాలకు కలిపి జూలై 14 నుంచి పీజీ ఈసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నారు. గేట్, జీప్యాట్ అర్హతగల అభ్యర్థులకు తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. రాష్ట్రాలు విడిపోయినా కౌన్సెలింగ్‌లో గత ఏడాది నిబంధనలనే పాటించనున్నట్టు పేర్కొన్నారు.
‘పీజీ ఈసెట్’లో మహిళలదే పైచేయి
Published Tue, Jun 17 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM
Advertisement