Joint Entrance Examination
-
వారు జేఈఈ–అడ్వాన్స్‌డ్‌కు రిజిస్టర్ చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కల్పించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–అడ్వాన్స్డ్ పరీక్షను అభ్యర్థులు కేవలం రెండుసార్లు రాసుకొనేలా జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకొనేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జేఈఈ– అడ్వాన్స్డ్ ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి హఠాత్తుగా రెండుకు తగ్గించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 2024 నవంబర్ 5 నుంచి 18వ తేదీ వరకు తమ కోర్సుల నుంచి డ్రాప్ అయిన అభ్యర్థులు జేఈఈ–అడ్వాన్స్డ్–2025 పరీక్ష రాసేందుకు రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వు జారీ చేసింది. ప్రయత్నాల సంఖ్యను మూడు నుంచి రెండుకు తగ్గించడం వల్ల తాము నష్టపోతామని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అస్సాంలో జేఈఈ టాపర్ అరెస్టు
గువాహటి: తన బదులు మరొకరితో పరీక్ష రాయించి, అస్సాంలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ)–మెయిన్‌లో టాపర్‌గా నిలిచిన నీల్ నక్షత్ర దాస్‌ను అరెస్టు చేసినట్లు గువాహటి పోలీసులు బుధవారం తెలిపారు. ఈ పరీక్షలో నక్షత్ర దాస్ 99.8 శాతం పర్సంటైల్ సాధించి, అస్సాం రాష్ట్రంలో టాపర్‌గా నిలిచాడు. అతడు మరొకరితో పరీక్ష రాయించినట్లు విచారణలో తేలింది. అంటే కష్టపడి చదవకుండానే, పరీక్షకు హాజరు కాకుండానే టాప్ ర్యాంకు కొట్టేశాడన్నమాట. ఈ విషయంలో నక్షత్ర దాస్‌కు అతడి తండ్రి డాక్టర్ జ్మోతిర్మయి దాస్, పరీక్ష కేంద్రం నిర్వాహకులు హేమేంద్రనాథ్ శర్మ, ప్రాంజల్ కలితా, హీరూలాల్ పాఠక్ సహకరించినట్లు విచారణలో బయటపడింది. తన కుమారుడు నక్షత్రదాస్కు టాప్ ర్యాంకు రావడానికి తండ్రి జ్యోతిర్మయి దాస్ దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. -
ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ మెయిన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీ వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) రాసే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షను ఇకపై మాతృభాషలోనే రాయొచ్చు. కంప్యూటర్ ఆధారిత జేఈఈ (మెయిన్)ను వచ్చే ఏడాది నుంచి పలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎన్ఈపీ విజన్‌ను దృష్టిలో పెట్టుకొని జేఈఈ(మెయిన్) టెస్టును పలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎక్కువ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు రమేశ్ పోఖ్రియాల్ గురువారం ట్వీట్ చేశారు. జేఈఈ(మెయిన్) ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష పెట్టాలని పలు రాష్ట్రాల నుంచి చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. గుజరాతీ భాషలో జేఈఈ(మెయిన్) నిర్వహిస్తూ ఇతర భాషలను విస్మరించడం పట్ల గత ఏడాది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విద్యా శాఖ వివరణ ఇచ్చింది. గుజరాత్ ప్రభుత్వం కోరడం వల్లే గుజరాతీ భాషలో పరీక్ష నిర్వహిస్తున్నామని, 2021 నుంచి 11 ప్రాంతీయ భాషల్లోనూ జేఈఈ(మెయిన్) ఉంటుందని వెల్లడించింది. జేఈఈ(మెయిన్) ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించే రాష్ట్రాల భాషను ఇందులో చేర్చనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మాతృభాషలో ఇంజనీరింగ్ అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నారు. అలాంటి భాషల్లో మెయిన్ ఉంటుందని సమాచారం. -
సమన్వయ లోపం.. విద్యార్థులకు శాపం..
మంచిర్యాల సిటీ : ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశించడానికి జాతీయస్థాయిలో సీబీఎస్ఈ నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ పరీక్ష (జేఈఈ)లో సత్తా చాటాలి. జేఈఈ పరీక్షతోపాటు ఇంటర్ (ఎంపీసీ)లో సైతం విద్యార్థి తన ప్రతిభను చూపించాలి. ఈ రెండింటిలో నెగ్గడానికి ఆసక్తి ఉన్న విద్యారిక్థి ఈ సంవత్సరం కూడా తగిన వ్యవధి లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఈసారీ ఇంటర్ పరీక్షలు ముగిసే సమయానికి జేఈఈ పరీక్ష నిర్వహించే సమయానికి కేవలం ఏడు రోజుల వ్యవధి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 2013 మార్చిలో ఇంటర్ పరీక్షలు 6న ప్రారంభమై 23న ముగిశాయి. 14 రోజుల తేడాతో ఆఫ్‌లైన్ విధానంతో జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 7న జరిగింది. 2014 మార్చిలో ఇంటర్ పరీక్షలు 12న ప్రారంభమై 26న ముగిశాయి. కేవలం పదిరోజుల తేడాతో ఆఫ్‌లైన్ విధానంతో ఏప్రిల్ 6న ఐఐటి పరీక్షను అధికారులు నిర్వహించారు. 2015 మార్చిలో ఇంటర్ పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 9 నుంచి 27 వరకు జరుగనున్నాయి. ఐఐటీ పరీక్ష ఆఫ్‌లైన విధానంతో ఏప్రిల్ 4న ఏడు రోజుల తేడాతో జరుగనుంది. అన్లైన్ విధానంతో ఏప్రిల్ 10, 11 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో ఆందోళన.. జిల్లా నుంచి జేఈఈ పరీక్షకు ఐదువేల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. మన విద్యార్థులకు ఆన్లైన్ విధానంపై అవగాహన, సాధన తక్కువ. ఆఫ్‌లైన్ (రాత పరీక్ష) కే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకుని వెయిటేజీ ఇవ్వనున్నామని సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు ముగిసే సమయానికి, జేఈఈ రాత పరీక్షకు వ్యవధి కేవలం ఏడు రోజులే ఉండటంతోపాటు విద్యార్థులు ఆందోళనకు గుర వుతున్నారు. లోపించిన సమన్వయం.. లక్షలాది రూపాయలు వెచ్చించి శిక్షణ కేంద్రాల్లో ఇంటర్‌తోపాటు ఐఐటీ ప్రవేశ పరీక్ష శిక్షణ పొందుతున్న విద్యార్థులు తక్కువ వ్యవధి ఉండటంతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు సీబీఎస్ఈ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే విద్యార్థులపై భారం పడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జేఈఈ పరీక్ష వివరాలను సీబీఎస్ఈ బోర్డు ముందుగానే ప్రకటిస్తుంది. ఆ తేదీలకు అనుగుణంగానే ఇంటర్ బోర్డు సిలబస్ పూర్తిచేయడంతోపాటు పరీక్షను నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. -
‘పీజీ ఈసెట్’లో మహిళలదే పైచేయి
* మహిళల ఉత్తీర్ణత 92.27%, పురుషుల ఉత్తీర్ణత 89.19% * పీజీ ఈసెట్ సీట్ల సంఖ్య పెంచుతాం: మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష పీజీ ఈసెట్-2014 ఫలితాల్లో మహిళా అభ్యర్థులు 92.27 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారు. పురుష అభ్యర్థులు 89.19 శాతం ఉత్తీర్ణులయ్యారు. పీజీ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను తెలంగాణ విద్యా శాఖ మంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డి, సీమాంధ్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు స్థానిక ఉస్మానియా దూరవిద్యా కేంద్రంలో సోమవారం సంయుక్తంగా విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొత్తం 1,08,112 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకాగా, వీరిలో 97,640 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలకుపైగా ఖాళీగా ఉన్న ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ సీట్లను భర్తీ చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఠీఠీఠీ. ్చఞఞజ్ఛఛ్ఛ్టి.ౌటజ, ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పీజీ ఈసెట్‌కు డిమాండ్ పెరిగిందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. పీజీ-ఈసెట్ సీట్లను పెంచి లోటు భర్తీ చేస్తామని అన్నారు. సీమాంధ్రలో విద్యాప్రమాణాలు మెరుగు పరచడంతో పాటు, ఉన్నత విద్యలో తమ ప్రాంతాన్ని ఓ రోల్ మోడల్‌గా మారుస్తానని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ ప్రకాష్, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ సత్యనారాయణ, రిజిస్ట్రార్ ప్రతాప్‌రెడ్డి, పీజీ ఈసెట్ కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై 14 నుంచి కౌన్సెలింగ్: రెండు రాష్ట్రాలకు కలిపి జూలై 14 నుంచి పీజీ ఈసెట్ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఆన్లైన్ వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను భర్తీ చేయనున్నారు. గేట్, జీప్యాట్ అర్హతగల అభ్యర్థులకు తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. రాష్ట్రాలు విడిపోయినా కౌన్సెలింగ్‌లో గత ఏడాది నిబంధనలనే పాటించనున్నట్టు పేర్కొన్నారు. -
ఉమ్మడి 'జీవో'పై కేసీఆర్ అసంతృప్తి!
హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్ష జీవో విడుదలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అసంతృప్తిని వ్యక్తం చేశారు. గవర్నర్ నివాసం రాజభవన్ లో నరసింహన్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. జూన్ 2వ తేదీ నుంచి పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలతో పాటు సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లోను ప్రస్తుతం ఉన్న ప్రవేశ కోటాను పదేళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగించడంపై నరసింహన్ తో కేసీఆర్ చర్చించినట్టు తెలుసింది. ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో విభజనకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. -
వేర్వేరుగానే ప్రవేశ పరీక్షలు!
ఒకటిగా సాంకేతిక, కళాశాల విద్య సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగానే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షల నిర్వహణ, ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే ఏడాది మాత్రం ఎక్కడి ప్రవేశ పరీక్షలు అక్కడే నిర్వహించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. పదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న విద్యా, ప్రవేశాల విధానామే ఉండాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఎలాగన్న అంశాలపైనా కసరత్తు చేస్తున్నారు. పదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న విధానమే అమలు చేయాల్సి ఉన్నందున.. తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సీట్లు కావాలనుకుంటే తెలంగాణ విద్యాశాఖ నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రవేశాలు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే దీనిపై రెండు ప్రభుత్వాలు చర్చించాల్సి ఉంద ని తెలిపారు. ఉన్నత విద్యామండలి సహా రాష్ట్ర స్థాయి వర్సిటీల విభజన రాష్ట్ర విభజనలో భాగంగా ఉన్నత విద్యామండలిని కూడా విభజించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదో షెడ్యూల్లో ఉన్నప్పటికీ మండలి, అందులో పని చేస్తున్న వారి విభజనకు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అధికారులు మండలి విభజనకు సంబంధించిన చర్యలు చేపట్టారు. రాష్ట్రస్థాయి యూనివర్సిటీలను కూడా విభజించే ఏర్పాట్లు చేయాలని పేర్కొనడంతో అధికారులు వాటిపైనా దృష్టి సారించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, ద్రవిడ విశ్వవిద్యాలయాలను విభజించే ందుకు కసరత్తు చేస్తున్నారు. ఏఎఫ్ఆర్సీ మాత్రం ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు సాంకేతిక విద్యా శాఖ, కళాశాల విద్యా శాఖలను విలీనం చేయాలని నిర్ణయించారు. -
జేఈఈ ప్రశాంతం
12,411 మంది విద్యార్థులు హాజరు పర్యవేక్షించిన సీబీఎస్ఈ డిప్యూటీ సెక్రటరీ మనోరంజన్ నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) వరంగల్ నగరంలో ప్రశాంతంగా ముగిసింది. జేఈఈ పేపర్-1, 2 కలిపి 12,818 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా... 12,411 మంది మాత్రమే హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నగరంలోని 17 సెంటర్లలో పేపర్-1 (ఇంజినీరింగ్ విభాగం) పరీక్ష జరిగింది. 9,933 మంది విద్యార్థులకు 9,668 మంది మాత్రమే రాశారు. 265 మంది గైర్హాజరు కాగా... హాజరు 97 శాతంగా నమోదైంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంట ల వరకు నాలుగు సెంటర్లలో పేపర్-2 (బీ ఆర్క్, బీ ప్లానింగ్ విభాగం) పరీక్ష జరిగింది. 2,885 మంది విద్యార్థులకు 2,743 మంది మాత్రమే హాజరయ్యూ రు. 142 మంది గైర్హాజరు కాగా... పేపర్-2లో వి ద్యార్థుల హాజరు 95 శాతంగా నమోదైంది. అత్యధికంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య డిగ్రీ కళాశాలల్లో 900 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. పేపర్-2 పరీక్ష యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్, చైత న్య డిగ్రీ కళాశాలలతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో జరిగాయి. పర్యవేక్షించిన మనోరంజన్ నగరంలో జరిగిన జేఈఈ పరీక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిప్యూటీ సెక్రటరీ మనోరంజన్, సీబీఎస్ఈ బోర్డుకు చెందిన 22మంది పర్యవేక్షించారు. ప్రత్యేక బస్సుల ఏర్పాటు జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేరవేసేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ సంస్థలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఆర్టీసి 25, ప్రైవే టు కళాశాలు,స్కూళ్లు 22 బస్సులను నడిపాయి. సేవలందించిన ఆరోగ్య కార్యకర్తలు నగరంలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య కార్యకర్తలు సేవలందించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా వారికి విధులు కేటాయించారు. పరీక్షలు సజావుగాజరిగాయి నగరంలో జేఈఈ పరీక్షలు సజావుగా జరిగాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు మాత్రమే ఇక్కడ రాశారు. ఇందులో 90 శాతం మంది వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులే ఉన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో జిల్లా పోలీస్ యత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది. - మథ్యాస్‌రెడ్డి, వరంగల్ సెంటర్ కోఆర్డినేటర్