జేఈఈ ప్రశాంతం | 12.411 students attend | Sakshi
Sakshi News home page

జేఈఈ ప్రశాంతం

Published Mon, Apr 7 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM

12.411 students attend

  •     12,411 మంది విద్యార్థులు హాజరు
  •      పర్యవేక్షించిన సీబీఎస్‌ఈ డిప్యూటీ సెక్రటరీ మనోరంజన్
  •  నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) వరంగల్ నగరంలో ప్రశాంతంగా ముగిసింది. జేఈఈ పేపర్-1, 2 కలిపి 12,818 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా...  12,411 మంది మాత్రమే హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నగరంలోని 17 సెంటర్లలో పేపర్-1 (ఇంజినీరింగ్ విభాగం) పరీక్ష జరిగింది. 9,933 మంది విద్యార్థులకు 9,668 మంది మాత్రమే రాశారు. 265 మంది గైర్హాజరు కాగా... హాజరు 97 శాతంగా నమోదైంది.

    మధ్యాహ్నం 2 నుంచి 5 గంట ల వరకు నాలుగు సెంటర్లలో పేపర్-2 (బీ ఆర్క్, బీ ప్లానింగ్ విభాగం) పరీక్ష జరిగింది. 2,885 మంది విద్యార్థులకు 2,743 మంది మాత్రమే హాజరయ్యూ రు. 142 మంది గైర్హాజరు కాగా... పేపర్-2లో వి ద్యార్థుల హాజరు 95 శాతంగా నమోదైంది. అత్యధికంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య డిగ్రీ కళాశాలల్లో 900 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
     
    పేపర్-2 పరీక్ష యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్, చైత న్య డిగ్రీ కళాశాలలతోపాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్‌లో  జరిగాయి.
     
    పర్యవేక్షించిన మనోరంజన్

    నగరంలో జరిగిన జేఈఈ పరీక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిప్యూటీ సెక్రటరీ మనోరంజన్, సీబీఎస్‌ఈ బోర్డుకు చెందిన 22మంది పర్యవేక్షించారు.
     
    ప్రత్యేక బస్సుల ఏర్పాటు
     
    జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేరవేసేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ సంస్థలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఆర్టీసి 25, ప్రైవే టు కళాశాలు,స్కూళ్లు 22 బస్సులను నడిపాయి.
     
    సేవలందించిన ఆరోగ్య కార్యకర్తలు

    నగరంలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య కార్యకర్తలు సేవలందించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా వారికి విధులు కేటాయించారు.
     
     పరీక్షలు సజావుగాజరిగాయి
     నగరంలో జేఈఈ పరీక్షలు సజావుగా జరిగాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు మాత్రమే ఇక్కడ రాశారు. ఇందులో 90 శాతం మంది వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులే ఉన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో జిల్లా పోలీస్ యత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది.
     - మథ్యాస్‌రెడ్డి, వరంగల్ సెంటర్ కోఆర్డినేటర్
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement