manoranjan
-
పార్లమెంట్ ఘటన.. మాజీ డీఎస్పీ కొడుకు అరెస్ట్?
బెంగళూరు/ఢిల్లీ: పార్లమెంట్‌లోకి చొరబాటు.. లోక్‌సభ దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ మాజీ పోలీసు అధికారి కొడుకును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి భాగల్‌కోట్‌లో నివాసంలో అతన్ని ప్రశ్నించిన పోలీసులు.. ఆపై అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు. అతని ల్యాప్‌ట్యాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్నవ్యక్తి పేరు సాయికృష్ణ జగలి. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడని పోలీసులు ప్రకటించారు. పార్లమెంట్లో అలజడి సృష్టించిన మనోరంజన్.. సాయికృష్ణ ఇద్దరూ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌మేట్స్.. రూమ్మేట్స్ కూడా. సాయికృష్ణ తండ్రి డీఎస్పీగా రిటైర్ అయిన అధికారిగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సాయికృష్ణ అరెస్ట్‌పై ఆమె సోదరి స్పందన స్పందించారు. తన సోదరుడు ఎలాంటి తప్పు చేయలేదని ఆమె అంటున్నారు. ‘‘ఢిల్లీ పోలీసులు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే. వాళ్లు సాయిని ప్రశ్నించారు. ఎంక్వయిరీకి పూర్తిగా మేం సహకరించాం. సాయికృష్ణ ఎలాంటి తప్పు చేయలేదు. మనోరంజన్, సాయి రూమ్మేట్స్ అనే మాట వాస్తవం. ప్రస్తుతం నా సోదరుడు వర్క్‌ఫ్రమ్ హోంలో ఉన్నాడు’’ అని తెలిపారామె. మరోవైపు ఈ కేసుకు సంబంధించి యూపీకి చెందిన ఓ వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. #WATCH | Police have detained a man from Karnataka's Bagalkote, who was accused D. Manoranjan's roommate during their engineering college days, in connection with the Parliament security breach case pic.twitter.com/ZSZj02C9vK — ANI (@ANI) December 21, 2023 పార్లమెంట్ ఘటనలో బుధవారం వరకు.. ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మణిపూర్ ఘటన, దేశంలో నిరుద్యోగం, రైతు సమస్యలు.. వీటన్నింటిపై కేంద్రానికి నిరసన తెలిపేందుకు తాము ఈ పని చేశామని నిందితులు అంటున్నారు. అయితే.. అన్నీ కోణాల్లోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పోఈసులు అంటున్నారు. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లే యత్నం చేయడంతో పాటు కలర్ స్మోక్ షెల్స్ తెరిచి అలజడి రేపినందుకుగానూ మనోరంజన్‌తో పాటు సాగర్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ నిరసన చేసిన అమోల్ షిండే, నీలం ఆజాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలపై కేసులు నమోదు అయ్యాక దర్యాప్తులో లలిత్ ఝా అనే వ్యక్తిని(ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు), అతనికి సహకరించిన రాజస్థాన్‌వాసి మహేష్ కునావత్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
Parliament: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి
ఢిల్లీ: నూతన పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో సభలో దుండగులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు . అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో, ఈ ఘటన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి దేవరాజ్ పార్లమెంట్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తాజాగా దేవరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. తన కొడుకు చేసింది ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నారు. పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి చొరబడి తన కొడుకు తప్పు చేశాడని అంగీకరించాడు. ఇక తన కొడుకు సమాజానికి తప్పు చేసినట్లైతే అతడిని ఉరితీయాలని కామెంట్స్ చేశారు. తన కొడుకు ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహిస్తానని.. కానీ ఇలా తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని అన్నారు. In #Karnataka's #Mysuru, Devraj, father of Manoranjan who caused a security breach inside the Lok Sabha today, says, "This is wrong, nobody should do anything like that... If my son has done anything good, of course, I support him but If he has done something wrong I strongly… pic.twitter.com/5DTbNhJyG2 — Hate Detector 🔍 (@HateDetectors) December 13, 2023 నిందితుల వివరాలు ఇలా.. లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి కౌర్, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు పోలీసులు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్. After breaking the law herself, she says, save the Constitution, 😂😂#ParliamentAttack#SecurityBreach #LokSabha pic.twitter.com/BF1uo5rvhj — Prabha Rawat🕉️🇮🇳 (@Rawat_1199) December 13, 2023 అయితే వీరందరూ భగత్‌సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో ఆన్లైన్లో పరిచయం చేసుకున్నట్టు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే పార్లమెంట్లో అలజడి సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా పాస్‌లతోనే పార్లమెంట్‌లోకి వచ్చినట్టు వివరించారు. మరోవైపు.. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్లో నీలం దేవి కౌర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనల్లో పాల్గొందని.. కానీ ఏ రాజకీయ పార్టీతో ఆమెకు సంబంధం లేదని నీలం దేవి సోదరుడు చెప్పారు. ఇక, వీరంతా లలిత్ ఝా ఇంట్లోనే బస చేసినట్టు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు. BJP MP Pratap Simha, who gave passes to Sagar Sharma for entering #LokSabha leading to a significant #SecurityBreach #ParliamentAttack2023, shud be suspended and his house shud be bulldozed. His alleged role in aiding Sagar shud be probed. #BJPFailsIndia #AmitShah… pic.twitter.com/Je3TDeXGmM — Faheem (@stoppression) December 13, 2023 ఇదిలా ఉండగా.. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఏపీఏ), ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. Parliament security breach | A case under Sections 120-B (criminal conspiracy), 452 (trespassing), Section 153 (want only giving provocation with an intent to cause riot), 186 (obstructing public servant in discharge of public functions), 353 (assault or criminal force to deter… — ANI (@ANI) December 14, 2023 Sansad breaking. Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB — sansadflix (@sansadflix) December 13, 2023 -
జేఈఈ ప్రశాంతం
12,411 మంది విద్యార్థులు హాజరు పర్యవేక్షించిన సీబీఎస్ఈ డిప్యూటీ సెక్రటరీ మనోరంజన్ నిట్ క్యాంపస్, న్యూస్‌లైన్ : దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ) వరంగల్ నగరంలో ప్రశాంతంగా ముగిసింది. జేఈఈ పేపర్-1, 2 కలిపి 12,818 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా... 12,411 మంది మాత్రమే హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నగరంలోని 17 సెంటర్లలో పేపర్-1 (ఇంజినీరింగ్ విభాగం) పరీక్ష జరిగింది. 9,933 మంది విద్యార్థులకు 9,668 మంది మాత్రమే రాశారు. 265 మంది గైర్హాజరు కాగా... హాజరు 97 శాతంగా నమోదైంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంట ల వరకు నాలుగు సెంటర్లలో పేపర్-2 (బీ ఆర్క్, బీ ప్లానింగ్ విభాగం) పరీక్ష జరిగింది. 2,885 మంది విద్యార్థులకు 2,743 మంది మాత్రమే హాజరయ్యూ రు. 142 మంది గైర్హాజరు కాగా... పేపర్-2లో వి ద్యార్థుల హాజరు 95 శాతంగా నమోదైంది. అత్యధికంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య డిగ్రీ కళాశాలల్లో 900 మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. పేపర్-2 పరీక్ష యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్, చైత న్య డిగ్రీ కళాశాలలతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెయింట్‌పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో జరిగాయి. పర్యవేక్షించిన మనోరంజన్ నగరంలో జరిగిన జేఈఈ పరీక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డిప్యూటీ సెక్రటరీ మనోరంజన్, సీబీఎస్ఈ బోర్డుకు చెందిన 22మంది పర్యవేక్షించారు. ప్రత్యేక బస్సుల ఏర్పాటు జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు చేరవేసేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ సంస్థలు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఆర్టీసి 25, ప్రైవే టు కళాశాలు,స్కూళ్లు 22 బస్సులను నడిపాయి. సేవలందించిన ఆరోగ్య కార్యకర్తలు నగరంలోని పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య కార్యకర్తలు సేవలందించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా వారికి విధులు కేటాయించారు. పరీక్షలు సజావుగాజరిగాయి నగరంలో జేఈఈ పరీక్షలు సజావుగా జరిగాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు మాత్రమే ఇక్కడ రాశారు. ఇందులో 90 శాతం మంది వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులే ఉన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో జిల్లా పోలీస్ యత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది. - మథ్యాస్‌రెడ్డి, వరంగల్ సెంటర్ కోఆర్డినేటర్