ఉమ్మడి 'జీవో'పై కేసీఆర్ అసంతృప్తి!
హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్ష జీవో విడుదలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అసంతృప్తిని వ్యక్తం చేశారు. గవర్నర్ నివాసం రాజభవన్ లో నరసింహన్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. జూన్ 2వ తేదీ నుంచి పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి నిన్న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలతో పాటు సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లోను ప్రస్తుతం ఉన్న ప్రవేశ కోటాను పదేళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగించడంపై నరసింహన్ తో కేసీఆర్ చర్చించినట్టు తెలుసింది. ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో విభజనకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.