ఎంటెక్ స్పాన్సర్డ్ సీట్లకు దరఖాస్తు
Published Tue, Jul 26 2016 9:02 PM | Last Updated on Sat, Jun 2 2018 5:59 PM
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలోని ఎంటెక్ స్పాన్సర్డ్ విభాగంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఓ.అనీల్‌కుమార్ తెలిపారు. దరఖాస్తువిధానం, ఫీజు వివరాలు,అర్హత, సీట్ల సంఖ్య తదితర వివరాలను ఏయూ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చును. ఆగష్టు 4వ తేదీలోగా పూర్తిచేసిన దరఖాస్తులను అందజేయాలి. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ విద్యార్హతలు, అనుభవాలను తెలియజేసే ధ్రువపత్రాలను తీసుకురావాలి. కౌన్సెలింగ్ ఫీజుగా రూ 1000, ఎస్సీ,ఎస్టీలు రూ 500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశం పొందినవారు వెంటనే సంబంధిత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆగష్టు 7వ తేదీన ఉదయం 9 గంటలకు కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, జియో ఇంజనీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులకు మద్యాహ్నం 2 గంటలకు కంప్యూటర్‌సైన్స్, సిస్టమ్స్ ఇంజినీరింగ్, ఈసిఈ, ఇనుస్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెటలర్జీ కోర్సులకు ప్రవేశాలు జరుపుతారు. ప్రవేశాలు ఏయూ ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో మాత్రమే జరుగుతాయి.
Advertisement
Advertisement