ఎట్టకేలకు తెరచుకోనున్న రైల్వే గేట్
–మొదలైన పునరుద్ధరణ పనులు
–మిఠాయిల పంపిణీ
ఆలేరు : ఎట్టకేలకు ఆలేరు రైల్వే గేట్ తెరుచుకోనుంది. గత నెల 9న రైల్వే గేట్ మూసివేశారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతుండడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పలుమార్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రైల్వే జీఎం, రైల్వేమంత్రి సురేష్‌ప్రభును కలిసి వినతిపత్రాలు అందజేశారు. దీంతో ఆర్‌యూబీ నిర్మాణానికి రైల్వేశాఖ అనుమతించింది. వంతెన నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ, రైల్వేశాఖ వారు సంయుక్తంగా రూ. 5.25 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించారు. ఆÆŠయూబీ నిర్మాణానికి 9 నెలల సమయం పడుతుందని నిర్ణయించారు. ఆర్‌యూబీ నిర్మాణంతో పాటు రైల్వేగేట్‌ను తెరవాలని నిర్ణయించారు. అయితే ఆర్‌యూబీ నిర్మాణం పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెయింటెన్స్ ఖర్చులు సుమారు రూ. 33 లక్షలు ఖర్చు అవుతాయని, డిపాజిట్ చేయాలని రైల్వేశాఖ కోరింది. దీంతో ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తన సొంత డబ్బులు డిపాజిట్ చేసినట్లు తెలిసింది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు తదితరులు పలు మార్లు రైల్వే జీఎంలను కలిశారు. మొత్తం మీద రైల్వేగేట్‌ను తెరిచేందుకు పనులు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో రైల్వేగేట్‌ను తెరచి యధావిధిగా కొనసాగించనున్నారు.
మిఠాయిల పంపిణీ
ఆలేరులో రైల్వేగేట్ పునరుద్ధరణ పనులు ప్రారంభం కావడంతో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గేట్ వద్దకు చేరుకుని పనులు చేపడుతున్న రైల్వేసిబ్బందికి మిఠాయిలు తినిపించారు. గేట్‌ను తెరిపించేందుకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బండ్రు శోభారాణి, కొలుపుల హరినాథ్, కె సాగర్‌రెడ్డి, ఎండి సలీం, పులిపలుపుల మహేష్, జెట్ట సిద్దులు, కామిటికారి కృష్ణ, దడిగె ఇస్తారి, ఎగ్గిడి శ్రీశైలం, వడ్డెమాన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.