
గాయపడిన ఎద్దు
చిత్తూరు,పలమనేరు: మండలంలోని కృష్ణాపురం కౌం డిన్య అటవీ ప్రాంతానికి మేతకోసం వెళ్లిన ఎద్దు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన నాటుబాంబును కొరికింది. దీంతో ఎ ద్దు దవడలు పూర్తిగా పేలిపోయి చర్మం వేలాడుతోంది. దీన్ని గమనించిన కాపరి ఎద్దును గ్రామానికి తోలుకొచ్చాడు. వేటగాళ్లు ఈ ప్రాంతంలో దుప్పుల కోసం అమర్చిన ఉంటను తినడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు వాపోయాడు. మైలేరు పండుగల్లో పలు బహుమతులు గెలిచిన ఎద్దు విలువ లక్షకు పైగా ఉంటుందని తెలిపాడు.