పండుగ శోభ
పంట సాగులో కీలకమైన పశువులంటే అన్నదాతలకు మక్కువ ఎక్కువ. పండుగలు వస్తే వాటి పట్ల మరింత శ్రద్ధ కనబరుస్తుంటారు. ప్రత్యేకించి సంక్రాంతి పండుగ అంటే తమ ఇంట ఉన్న పశువులను ప్రత్యేకంగా అలంకరించి మురిసిపోతుంటారు. ఇందులో భాగంగానే వాటికి సంబంధించి ఇంతకాలం భద్రంగా దాచి ఉంచిన అలంకరణ సామగ్రిని బయటకు తీశారు. వృషభాల కొమ్ములకు రంగులు అద్దడం.
రంగురంగుల ఉలన్‌తో చేసిన కుచ్చులతో సింగారిస్తున్నారు. అద్దాలు పొదిగిన ఫణికట్లను కపాలభాగానికి అమర్చారు. మెడలో గంటల పట్టీ, మెడ కింద నల్లదారాలు, వీపుపై గోపురానికి రంగురంగుల కుచ్చులు... కాళ్లకు గజ్జెలు.. రంగుల ముకుతాడు... ఇలా ప్రత్యేకంగా అలంకరించిన వృషభాలు పల్లెసీమలో పండుగకు నూతన శోభను తీసుకొస్తున్నాయి.
- ఆత్మకూరు