వీడియో దృశ్యం.. కాశీ ఈశ్వర అంత్యక్రియలు
చెన్నై : టిక్‌టాక్ వీడియో కోసం మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు జల్లికట్టు ఎద్దును దారుణంగా రాళ్లతో కొట్టి చంపారు. ఈ అమానుష ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరికి చెందిన వెట్రివేల్ అనే వ్యక్తికి కాశీ ఈశ్వర అనే జల్లికట్టు ఎద్దు ఉంది. కొద్దిరోజుల క్రితం అది గాయాలపాలై మృతి చెందింది. ప్రమాదవశాత్తు అది మరణించి ఉండొచ్చని వెట్రివేల్ భావించాడు. అయితే గురువారం ముగ్గురు తాగుబోతు యువకులు ఎద్దు చుట్టూ చేరి రాళ్లతో కొడుతూ.. ఇసుక చల్లుతూ హింసిస్తున్న ఓ టిక్‌టాక్ వీడియోను అతడు చూశాడు. ఆ వెంటనే ముగ్గురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెట్రివేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( అందుకే కోట్ల ఆస్తి ఆ ఏనుగులకు రాశా! )
ఆ వీడియోలో.. కొందరు తాగుబోతు యువకులు చెట్టుకు కట్టేసి ఉన్న ఎద్దు చుట్టూ చేరారు. దాన్ని రాళ్లతో కొడుతూ.. ఇసుక చల్లుతూ హింసించసాగారు. అది ఆగ్రహంతో వారిపై ఉరకటానికి ప్రయత్నించి. ఈ నేపథ్యంలో రాళ్లు దాని ముఖానికి తగల సాగాయి. దీంతో తల భాగంలో తీవ్రంగా దెబ్బలు తగిలాయి. రెండు కొమ్ములు కూడా దెబ్బతిన్నాయి. ( జల్లికట్టు.. పోలీసుపై ఎద్దు దాడి )
Comments
Please login to add a commentAdd a comment