
Cyclist Tossed In The Air By Raging Bull: ఇంతవరకు ఎద్దు దాడికి సంబంధించిన వీడియోలను చూశాం. సాధారణంగా ఎద్దు దాడి చేయదు. తన దారికి అడ్డు వచ్చినప్పుడో లేక మరే ఏ ఇతర కారణాల వల్లనే ఒక్కోసారి చాలా భయంకరంగా దాడి చేస్తుంది. అచ్చం అలానే ఒక సైకిల్ రైడర్ పై ఎద్దు ఘెరంగా దాడి చేసింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియాలో రేస్‌లో పాల్గొంటున్న సైక్లిల్ రైడర్ల పై ఎద్దు దాడి చేసింది. ముగ్గురు వ్యక్తులు సైకిల్ రేసింగ్ చేస్తుండగా ఒక ఎద్దు అనుహ్యంగా ఒక సైకిల్ రైడర్ పై దారుణంగా దాడి చేసింది. ఆ వ్యక్తిని అమాత్తంగా గాల్లోకి ఎత్తిపడేసింది. అక్కడ ఉన్న మిగతా వాళ్ల పై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించింది.
అదృష్టవశాత్తు వారికి ఏం కాలేదు ముగ్గురు సురక్షితంగానే ఉన్నారు. అయితే వారు రేసింగ్ మొదలు పెట్టినప్పుడు ఎద్దు యజమాని దానిని గడ్డి ఉన్న బీడుభూమి వైపుకి చాలా దూరం తీసుకువెళ్లాడు. అయినప్పటికీ అది తిరిగి వచ్చి మరీ వాటి పై దాడి చేసింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.
(చదవండి: హైహీల్స్‌తో జంప్ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ!.. ఫిదా అవుతున్న నెటిజన్లు!)
Comments
Please login to add a commentAdd a comment