smashes
-
వైరల్: నడిరోడ్డుపై ఎద్దు బీభత్సం
పాట్న: కోపంతో ఉన్న ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. కట్టలు తెగే కోపంతో, భీకరంగా అరుస్తూ.. పలు వాహనాలపై దాడి చేసింది. దీంతో చుట్టపక్కల ఉన్న జనాలు బెదిరిస్తూ వెళ్లగొట్టినా.. ఏ మాత్రం ఆగకుండా పలు వాహనాలను తన కొమ్ములతో దాడిచేసి బోర్లాకొట్టించింది. ఒక్కసారిగా చుట్టపక్కల ఉన్న వాహనదారులు, జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటన బీహార్లోని హజీపూర్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ ఎద్దు తీవ్రమైన కోపంతో, భయంకరంగా అరుస్తూ రోడ్డుపై బీభత్సం చేసింది. రోడ్డు మీద పార్క్ చేసిన ఓ ఆటోను తన కొమ్ములతో బలంగా పొడుస్తూ పోర్లాపడేసింది. ఎద్దును వెళ్లగొట్టడానికి ఓ వ్యక్తి నీళ్లు పోసినా ఆటోను పడేయటం ఆపలేదు. దీంతో పాటు ఓ తోపుడు బండిని తన తలతో తోసుకుంటా నడిరోడ్డు మీదకి వచ్చింది. వాహనాదారులకు తీవ్రంగా ఆటంకం కలిగించింది. అనంతరం ఆదే స్థాయి కోపంతో నిలిచిఉన్న కారును తన కొమ్ములతో పొడుస్తూ.. బోర్లాపడేసే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ నీళ్లు పోస్తూ, మరో వ్యక్తి పొడవాటి కర్ర సాయంతో బెదిరిస్తూ.. ఎద్దును వెళ్లగొట్టారు. ఆ ఎద్దు సృష్టించింన బీభత్సంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
డొమినికన్ రిపబ్లికన్లో షాకింగ్ ఇన్సిడెంట్
-
ఉడీ దాడి బాధితులకు వినూత్న నివాళి
-
అయ్యో పాపం..!
-
చైనా ఇల్లాలికి కోపం వస్తే...?
బీజింగ్: చైనాలో ఈ మధ్య భార్యలంతా అపర చండికలుగా మారుతున్నారు. ఏమాత్రం ఆగ్రహం వచ్చినా వెంటనే తమ వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా భర్త ఉంటే మాత్రం అతడి పరిస్థితి కూడా ఆ వాహనాల మాదిరిగా అధోగతి పాలవక తప్పదేమో అనే అనుమానం వారి ఆగ్రహం చూస్తే కలగక తప్పదేమో. తన భర్త మోసం చేశాడని... ఓ ఇల్లాలు... అతడి వీడబ్ల్యూ పస్సాత్ కారుపై దాడి చేసింది. ఏకంగా సుత్తి, ఒక రాడ్డు తీసుకొని వచ్చి ముందుగా ఆ కారు చుట్టు ప్రదక్షిణ చేసింది. అనంతరం తన బలాన్నంతా ఉపయోగించి దెబ్బ మీద దెబ్బ.... దెబ్బ మీద దెబ్బలతో ఫటాఫటా కారును కుమ్మేసింది. అయితే, ఆమె అంత కష్టపడినా కారు కనీసం సొట్టలు కూడా పోడకపోవడం గమనార్హం. కేవలం కారు అద్దాలు, లైట్లు మాత్రమే ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనను ఓ వ్యక్తి దొంగచాటుగా రెండు నిమిషాలపాటు వీడియోలు చిత్రీకరించి ఇంటర్నెట్లో పెట్టగా అదిప్పుడు హల్ చల్ చేస్తోంది. మొత్తం 20 నిమిషాలపాటు ఆ కారును ధ్వంసం చేయాలని ఆమె ప్రయత్నించిందని... వీడియో తీసిన వ్యక్తి తెలిపాడు. కాగా, తన భర్త కారులోనే ఉన్నాడనే కోపంతో ఆమె ఈ దాడికి దిగిందట. చైనా కరెన్సీలో ఆ కారు కోట్లలో ఉంటుందట. ఈ మధ్య కాలంలో భర్త కారును భార్య ధ్వంసం చేయడం, ప్రియుడి కారును ప్రేయసి ధ్వంసం చేయడంలాంటి ఘటనలు చైనాలో వరుసగా జరుగుతున్నాయి.