చైనా ఇల్లాలికి కోపం వస్తే...? | Furious wife smashes up her husband's VW Passat after discovering he had been cheating on her | Sakshi
Sakshi News home page

చైనా ఇల్లాలికి కోపం వస్తే...?

Published Mon, Nov 23 2015 8:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

చైనా ఇల్లాలికి కోపం వస్తే...?

చైనా ఇల్లాలికి కోపం వస్తే...?

బీజింగ్: చైనాలో ఈ మధ్య భార్యలంతా అపర చండికలుగా మారుతున్నారు. ఏమాత్రం ఆగ్రహం వచ్చినా వెంటనే తమ వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఆ సమయంలో ఎదురుగా భర్త ఉంటే మాత్రం అతడి పరిస్థితి కూడా ఆ వాహనాల మాదిరిగా అధోగతి పాలవక తప్పదేమో అనే అనుమానం వారి ఆగ్రహం చూస్తే కలగక తప్పదేమో. తన భర్త మోసం చేశాడని... ఓ ఇల్లాలు... అతడి వీడబ్ల్యూ పస్సాత్ కారుపై దాడి చేసింది. ఏకంగా సుత్తి, ఒక రాడ్డు తీసుకొని వచ్చి ముందుగా ఆ కారు చుట్టు ప్రదక్షిణ చేసింది. అనంతరం తన బలాన్నంతా ఉపయోగించి దెబ్బ మీద దెబ్బ.... దెబ్బ మీద దెబ్బలతో ఫటాఫటా కారును కుమ్మేసింది.

అయితే, ఆమె అంత కష్టపడినా కారు కనీసం సొట్టలు కూడా పోడకపోవడం గమనార్హం. కేవలం కారు అద్దాలు, లైట్లు మాత్రమే ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనను ఓ వ్యక్తి దొంగచాటుగా రెండు నిమిషాలపాటు వీడియోలు చిత్రీకరించి ఇంటర్నెట్లో పెట్టగా అదిప్పుడు హల్ చల్  చేస్తోంది. మొత్తం 20 నిమిషాలపాటు ఆ కారును ధ్వంసం చేయాలని ఆమె ప్రయత్నించిందని... వీడియో తీసిన వ్యక్తి తెలిపాడు. కాగా, తన భర్త కారులోనే ఉన్నాడనే కోపంతో ఆమె ఈ దాడికి దిగిందట. చైనా కరెన్సీలో ఆ కారు కోట్లలో ఉంటుందట. ఈ మధ్య కాలంలో భర్త కారును భార్య ధ్వంసం చేయడం, ప్రియుడి కారును ప్రేయసి ధ్వంసం చేయడంలాంటి ఘటనలు చైనాలో వరుసగా జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement