అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు 2021లో యూఎస్ క్యాపిటల్‌పై హింసాత్మకంగా దాడి చేశారు. ఆ సమయంలో హింసకు కారకులైనవారిని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రశంసించినట్లు మెటా నిర్దారించింది. ఆ తరువాత ఆయన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై మెటా ఆంక్షలు విధించింది. అయితే..
తాజాగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ట్రంప్ మళ్ళీ భవిష్యత్తులో అలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు విధించే అవకాశం ఉందని మెటా స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా తప్పకుండా కొన్ని నియమాలకు లోబడి ఉండాలి. ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం వంటివి చేస్తే.. శాంతికి భంగం కలుగుతుంది. కాబట్టి సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని మెటా తెలిపింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే కాకుండా.. ట్రంప్ ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్ అకౌంట్లపై కూడా గతంలో సంబంధిత సంస్థలు ఆంక్షలు విధించాయి. గత ఏడాది ఈ పరిమితులను ఎత్తివేసినప్పటికీ.. ట్రంప్ మాత్రం తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్ ద్వారా తన సందేశాలను జనాలకు చేరవేస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment