ఉగ్రవాదుల దాడి.. 22 మంది సైనికులు మృతి | 22 Niger soldiers killed in refugee camp attack | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల దాడి.. 22 మంది సైనికులు మృతి

Published Fri, Oct 7 2016 8:47 AM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM

ఉగ్రవాదుల దాడి.. 22 మంది సైనికులు మృతి - Sakshi

ఉగ్రవాదుల దాడి.. 22 మంది సైనికులు మృతి

నీయామీ: శరణార్థుల శిబిరం వద్ద కాపలాగా ఉన్న సైనికులపై ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. ఈ ఘటన నైగర్ పశ్చిమ సరిహద్దు ప్రాంతం టస్సారా వద్ద చోటుచేసుకుంది. మాలి శరణార్దులకు రక్షణ కల్పిస్తున్న సైనికులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని జిన్హువా వార్తాసంస్థ తెలిపింది.

అయితే ఈ ఘటనపై నైగర్ ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ..  నైగర్స్ నేషనల్ టెలివిజన్ గురువారం రాత్రి సైనికులపై దాడి జరిగిన విషయాన్ని ప్రకటించింది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగిందని వెల్లడించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం సైనికులు ఆ ప్రాంతమంతా జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులు మాలి ఉత్తరప్రాంతానికి చెందిన వారై ఉంటారని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement