డెయిర్ అల్ బలాహ్(గాజా): సెంట్రల్ గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. నుసెయిరత్‌లో ఐరాస శరణార్థి శిబిరం నడుస్తున్న స్కూలుపై గురువారం జరిపిన దాడిలో 33 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఇజ్రాయెల్ సైన్యం డెయిర్ అల్ బలాహ్, జవాయిడా పట్టణాల్లోనిసెయిరత్, మఘాజి శరణార్థి శిబిరాలపై శుక్రవారం రాత్రి జరిపిన దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ ఉన్నట్లు అల్–హక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, గురువారం నుసెయిరత్‌లోని స్కూల్‌పై జరిపిన దాడిని ఇజ్రాయెల్ సమర్థించుకుంది. స్కూల్ భవనంలోని రెండు, మూడు అంతస్తుల్లో జరిగిన లక్షిత దాడుల్లో మృతి చెందిన వారిలో 9 మంది మిలిటెంట్లు ఉన్నట్లు వివరించింది. రెండు రోజులుగా జరుపుతున్న దాడుల్లో మిలిటెంట్ల సొరంగాలను, మౌలిక వసతులను ధ్వంసం చేసినట్లు ఆర్మీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment