జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారని ఎన్‌క్లేవ్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సెంట్రల్ గాజాలోని నుసిరత్‌లో ఉన్న అల్-అవ్దా ఆసుపత్రి పరిసరాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారు. వీరంతా అల్-ఖుద్స్ అల్-యూమ్ టెలివిజన్ ఛానెల్‌లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పాలస్తీనా మీడియా కథనాల ప్రకారం.. జర్నలిస్టులు ఆసుపత్రి లోపల నుంచి వస్తున్న సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో, వారు చనిపోయారు అని తెలిపింది. ఇక, మరణించిన జర్నలిస్టులను ఫాది హస్సౌనా, ఇబ్రహీం అల్-షేక్ అలీ, మహ్మద్ అల్-లదా, ఫైసల్ అబూ అల్-కుమ్సన్, అయ్మాన్ అల్-జాదీగా గుర్తించినట్లు అల్ జజీరా నివేదించింది.
ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. గాజా నగరంలోని జైటౌన్ పరిసరాల్లోని ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి సందర్భంగా వీరంతా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
Overnight, the IAF conducted an airstrike on a vehicle belonging to the TV news channel "Al Quds Today" in the Nuseirat refugee camp near the Al Awda hospital in central Gaza.
The IDF later released a statement claiming that it targeted a Palestinian Islamic Jihad (PIJ)… pic.twitter.com/M7BIA8BTz0— AMK Mapping 🇺🇦🇳🇿 (@AMK_Mapping_) December 26, 2024
Comments
Please login to add a commentAdd a comment