వైమానిక దాడులకు భయపడి రోధిస్తున్న చిన్నారులు
గాజా: గాజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలటరీ చీఫ్ మహమ్మద్ డిఫ్, అతడి భార్యతోపాటు చిన్నారి (2) కూడా మరణించారు. ఈ మేరకు హమాస్ నేత మౌస్సా అబూ మర్జోక్ బుధవారం ఫేస్ బుక్లో పేర్కొన్నారు. ఈ దాడి మంగళవారం రాత్రి చోటు చేసుకుందని... మహమ్మద్ డిఫ్, అతడి భార్య, కుమార్తెలు అమరులయ్యారని చెప్పారు. హామాస్ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడిందని ఆరోపించారు. వారి మిగిలిన పిల్లులు అనాధులయ్యారని చెప్పారు.
వైమానిక దాడిలో మరో 45 మంది మరణించారని తెలిపారు. జూలై 8 నుంచి ఇజ్రాయెల్, హమాస్ల మధ్య జరుగుతున్న పోరాటలో 2020 మంది పాలస్తీనియన్లు, 67 మంది ఇజ్రాయెల్ వారు మరణించారని చెప్పారు. 2002లో మహమ్మద్ డిఫ్ హమాస్ మిలటరీ వింగ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారని చెప్పారు. ఆ పదవి చేపట్టిన నాటి నుంచి దాదాపు 5 సార్లు ఆయనపై దాడి జరిగిందని.... ఆయన తృటీలో తప్పించుకున్నారని మౌస్సా అబూ మర్జోక్ వివరించారు.