టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధ నేరాలకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇతర అగ్రనేతలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ త్వరలో అరెస్ట్ వారెంట్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. దీంతో, ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. నెతన్యాహు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో భాగంగా ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్‌లను అంతం చేయడానికి ఇజ్రాయెల్ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు. మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. హమాస్ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తప్పకుండా విజయం సాధిస్తుందని కామెంట్స్ చేశారు.
The International Criminal Court may soon issue arrest warrants for Israeli Prime Minister Benjamin Netanyahu and other top leaders for war crimes. That's according to press reports out of Israel. Capitol Hill Correspondent @ErikRosalesNews reports. pic.twitter.com/lFuboZN6oK
— EWTN News Nightly (@EWTNNewsNightly) May 1, 2024
మరోవైపు.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇక.. రఫా నగరంపైకి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి జరిపిన దాడుల్లో మూడు కుటుంబాల్లోని ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదు రోజుల వయసున్న పసికందు ఉందని పాలస్తీనా అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment