రఫాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం.. అర్ధరాత్రి ఆర్తనాదాలు.. | Israel Army Air Strikes At Gaza's Southern City Rafah, Killed At least 35 | Sakshi
Sakshi News home page

రఫాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం.. భారీ సంఖ్యలో మరణాలు

Published Mon, May 27 2024 8:51 AM | Last Updated on Mon, May 27 2024 9:57 AM

Israel Army Air Strikes At Gaza's Southern City Rafah, Killed At least 35

ఇజ్రాయెల్‌ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌ తాజాగా దాడుల్లో దాదాపు 35 మంది పాలస్తీనియన్లు మృతిచెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

కాగా, ఇజ్రాయెల్‌ సైన్యం ఆదివారం రఫా నగరంపై బాంబు దాడులకు తెగబడింది. నివాసితులు ఉంటున్న గుడారాలపై వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో దాదాపు 35 మంది చనిపోయినట్టు గాజా వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాంబు దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. ఇక, అధిక సంఖ్యలో ప్రజలు నివాసం ఉన్న ప్రాంతంపై బాంబు దాడుల జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు.. రఫాపై తాము దాడులు చేయలేదని ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఈ దాడులతో తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది. రఫాలో ఏం జరుగుతుందో తమకు తెలియదని చెప్పుకొచ్చింది. మరోవైపు.. అంతకుముందు ఇజ్రాయెల్ రాజధాని టెలీ అవీవ్‌పై హమాస్‌ రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో రాజధానిలో సైరన్లు మోగాయి. కాగా, గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడుల కారణంగానే తాము ప్రతిదాడులు చేసినట్టు హమాస్‌ తెలిపింది.

 

 

ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్‌ బేఖాతరు చేసింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. దాడులను ఆపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఐసీజే ఆదేశాలను పట్టించుకోకుండా తాజాగా మరోసారి బాంబు దాడులకు తెగబడింది. 

 

ఇక, గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్, ఇజ్రాయెల్ మధ్య చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ వారాంతంలో ఇజ్రాయెల్, యుఎస్ ఇంటెలిజెన్స్ అధికారులు, ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ మధ్య జరిగే సమావేశాల తర్వాత కాల్పుల విరమణ చర్చపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement