హమాన్ నిర్మూలనే లక్ష్యంగా గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక ప్రజలు మరణిస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించడంతో రఫాలో 37 మంది మృతిచెందారు. కాగా, వీరి మృతిపై ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. వారి మరణాలకు తాము కారణంకాదని ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది.
కాగా, రఫాలో జరిగిన దాడులపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఇజ్రాయెల్ మంగళవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..‘రఫాలో ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. రఫాలో ఇద్దరు సీనియర్ హమాస్ కమాండర్లు యాసిన్ రబియా, ఖలీద్ నజ్జర్‌ను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు జరిగాయి. ఈ దాడి కోసం చాలా చిన్న ఆయుధాలు ఉపయోగించడం జరిగింది.
అయితే, ఈ క్రమంలో అనుకోకుండా మంటలు చెలరేగాయి. అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సందర్బంగా హమాస్ నేతలు దాచిన మందుగుండు సామాగ్రి పేలిన కారణంగానే పెద్ద ప్రమాదం జరిగి గుడారాల్లోని ప్రజలు చనిపోయారు. అంతేకానీ, మేము చేసిన దాడుల కారణంగా కాదు. ఇజ్రాయెల్ దాడులు కేవలం హమాస్ నేతల కోసమేనని.. గాజా ప్రజల కోసం కాదు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. గాజాపై మే నెలలో ఇజ్రాయెల్ దాడి ప్రారంభమైనప్పటి నుండి ఒక మిలియన్ మంది ప్రజలు రఫా నుండి పారిపోయారు. ఇక, అమెరికా, ఇతర మిత్రదేశాలు రఫాపై పూర్తి స్థాయి దాడికి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హెచ్చరించాయి. ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. మరోవైపు.. రఫాపై దాడిని ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం ఇజ్రాయెల్‌ను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment